కోహ్లీ ఎన్ని పరుగులు చేసి ఎవరి బౌలింగులో అవుటవుతాడో చెప్పిన యూజర్.. షాకైన సెహ్వాగ్

ABN , First Publish Date - 2022-03-05T02:06:03+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357

కోహ్లీ ఎన్ని పరుగులు చేసి ఎవరి బౌలింగులో అవుటవుతాడో చెప్పిన యూజర్.. షాకైన సెహ్వాగ్

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి వందో టెస్టు కావడంతో ఈ మ్యాచ్ అభిమానులకు ప్రత్యేకమైంది.


కోహ్లీకి ఇది వందో టెస్టు కావడంతో 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించారు. వందో మ్యాచ్‌లో వందో సెంచరీ చేయాలని కోహ్లీ అభిమానులు కోరుకున్నారు. అయితే, కోహ్లీ మాత్రం 45 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.


కోహ్లీ అవుటైన తర్వాత ట్విట్టర్‌లో షేర్ అయిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ తన వందో టెస్టులో సరిగ్గా 100 బంతులు ఆడి 45 పరుగులు చేస్తాడని, ఇందులో నాలుగు అద్భుతమైన కవర్ డ్రైవ్స్ కూడా ఉంటాయని శ్రుతి అనే ట్విటర్ యూజర్ అంచనా వేశారు. అంతేకాదు, ఎంబల్‌దెనియా బౌలింగులో అవుటై తీవ్ర అసంతృప్తితో తలవంచుకుని వెళ్లిపోతారని ఆ యూజర్ అందులో పేర్కొన్నారు. 


ఆ యూజర్ ఊహించినట్టుగానే కోహ్లీ అవుట్ కావడం, పరుగులు చేయడంతో ఇప్పుడు ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ యూజర్ చెప్పినట్టు 100 బంతులు కాదు కానీ 76 బంతులు ఆడి 45 పరుగులు చేశాడు. అలాగే, ఆ యూజర్ నాలుగు కవర్ డ్రైవ్‌లు అని చెబితే.. కోహ్లీ 5 ఫోర్లు కొట్టాడు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. ఆ యూజర్ అంచనా వేసినట్టు   ఎంబల్‌దెనియా బౌలింగులోనే కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. అంతేకాదు, తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగాడు. ఈ వీడియో ట్వీట్ తిరిగి తిరిగి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ‘వావ్’ అని స్పందిస్తూ రీ ట్వీట్ చేశాడు.



Updated Date - 2022-03-05T02:06:03+05:30 IST