కపిరాజా.. కరోనా నడ్డి నువ్వే విరవాలి.. సెహ్వాగ్ వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-04-11T04:10:26+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. భారతీయులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

కపిరాజా.. కరోనా నడ్డి నువ్వే విరవాలి.. సెహ్వాగ్ వీడియో వైరల్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. భారతీయులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ వీడియో తీసి ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో షేర్ చేశారు. హనుమాన్ చాలీసా పఠనం అనంతరం అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కరోనా నడ్డి విరవాలంటూ ఆ కపిరాజును వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. మీరు కూడా సెహ్వాగ్ మాటలు వినండి మరి.

Updated Date - 2020-04-11T04:10:26+05:30 IST