హర్భజన్ వర్కవుట్ వీడియోపై కోహ్లీ ఫన్నీ రియాక్షన్

ABN , First Publish Date - 2020-05-27T00:30:33+05:30 IST

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌‌లు లేకపోవడంతో.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్‌‌మీడియాలో గతంలోకంటే యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు

హర్భజన్ వర్కవుట్ వీడియోపై కోహ్లీ ఫన్నీ రియాక్షన్

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌‌లు లేకపోవడంతో.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్‌‌మీడియాలో గతంలోకంటే యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సంబంధించిన అప్‌డేట్లను అందిచడమే కాక.. తోటి క్రికెటర్లతో సంభాషిస్తున్నాడు. అయితే తాజాగా టీం ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ పోస్ట్ చేసిన ఓ వీడియోపై కోహ్లీ రియాక్షన్ అభిమానులచే నవ్వులు పూయిస్తోంది. 


తాను వర్కవుట్ చేస్తున్న వీడియోని హర్భజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అతను డంబుల్స్ ఎత్తడం మనం చూడొచ్చు. అయితే దీనిపై కోహ్లీ ఫన్నీగా స్పందించాడు. ‘‘వెల్‌డన్ పాజీ.. కానీ కాస్త నిదానంగా.. బిల్డింగ్ ఊగిపోతుంది’’ అని కోహ్లీ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. 

Updated Date - 2020-05-27T00:30:33+05:30 IST