మూడో వన్డే ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. సహచరులంతా గొంతు కలుపుతుండగా.. కోహ్లీ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండడంతో పాటు చూయింగ్ గమ్ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. దీంతో ఈ దృశ్యాలను చూసిన అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు. జట్టుకు ఆడడం ఇష్టం లేనట్టుందని.. అలా అయితే వైదొలగడం మేలని సూచిస్తున్నారు.