Abn logo
Sep 14 2021 @ 03:11AM

విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌

పుకార్లను ఖండించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని తప్పిస్తున్నారనే కథనాలు సోమవారం హల్‌చల్‌ చేశాయి. టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ ఓడితే కోహ్లీ బాధ్యతలను టెస్టులకే పరిమితం చేస్తారని.. మిగతా ఫార్మాట్లకు రోహిత్‌ను కెప్టెన్సీ చేస్తారనేది ఆ వార్తల సారాంశం. దీంతో ఈ సంచలన కథనాలపై బీసీసీఐ స్పందించింది. ‘ఇవన్నీ పసలేని వార్తలు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. మీడియానే అతిగా స్పందిస్తోంది. కెప్టెన్సీ మార్పు గురించి బీసీసీఐ ఇప్పటివరకు సమావేశం కాలేదు. ఎలాంటి చర్చా జరగలేదు. అన్ని ఫార్మాట్లకూ కోహ్లీనే కెప్టెన్‌’ అని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ స్పష్టం చేశాడు. 


‘కోహ్లీపై దుష్ప్రచారం’: కోహ్లీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ ఆరోపించాడు. ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో భారత్‌ అద్భుతంగా ఆడి టీ20 ప్రపంచక్‌పనకు సిద్ధమవుతున్న వేళ కెప్టెన్సీ విషయమై గందరగోళం సృష్టించడం సరికాదని హితవు పలికాడు.