విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు: రాహుల్ ద్రవిడ్

ABN , First Publish Date - 2021-12-26T00:56:11+05:30 IST

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. మూడు టెస్టుల

విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు: రాహుల్ ద్రవిడ్

సెంచూరియన్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్‌‌లో రేపు (ఆదివారం) తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్ మాట్లాడుతూ.. కోహ్లీ అద్భుతమైన సారథి మాత్రమే కాక నాయకుడు కూడా అని కొనియాడాడు.


టెస్టు క్రికెట్‌ను ఇష్టపడే వ్యక్తులలో కోహ్లీ ఒకడని అన్నాడు. తమను తాము నిరూపించుకునేందుకు ఈ సిరీస్ ప్రతి ఒక్కరికి మంచి అవకాశమని, అంతేకాకుండా సవాలుతో కూడుకున్నదని అన్నాడు. స్వదేశానికి ఆవల జరుగుతున్న ఈ సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కుర్రాళ్లకు సూచించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)ని దృష్టిలో పెట్టుకుని ఆడాలని అన్నాడు.


ఇటీవల భారత్‌కు ఆవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై అద్భుత విజయాలతో ఆకట్టుకున్న భారత్‌కు సౌతాఫ్రికాను వారి గడ్డపై ఎదుర్కోవడం కొంచెం కష్టమైన పనే. మరోవైపు, ఇటీవల ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విమర్శల నుంచి బయటపడేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా విమర్శకు నోళ్లు మూయించాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. దీనికి తోడు వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత అతడు ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ కూడా ఇదే కావడంతో అందరి దృష్టి ఇప్పుడు కోహ్లీపైనే ఉంది. 

Updated Date - 2021-12-26T00:56:11+05:30 IST