అవసరం లేకున్నా రెండో పరుగు కోసం పరుగెత్తిన కోహ్లీ

ABN , First Publish Date - 2020-10-22T22:14:51+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అలవోకగా విజయం సాధించింది. బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుత స్పెల్‌తో

అవసరం లేకున్నా రెండో పరుగు కోసం పరుగెత్తిన కోహ్లీ

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అలవోకగా విజయం సాధించింది. బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుత స్పెల్‌తో అదరగొట్టడంతో అంతకుముందు ప్రత్యర్థి జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. 85 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 39 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 



ఆర్సీబీ విజయానికి 40 బంతుల్లో ఒకే ఒక్క పరుగు అవసరం కాగా, ప్రసీధ్ కృష్ణ బౌలింగ్‌లో కీపర్ వెనక్కి బంతిని ఆడిన కోహ్లీ సింగిల్ తీయడంతో జట్టు విజయం సాధించింది. అయితే, సింగిల్ తీసిన అనంతరం కోహ్లీ రెండో పరుగు కూడా చేయడం విశేషం. అయితే, అప్పటికే బెంగళూరు విజయం సాధించడంతో రెండో పరుగు లెక్కలోకి రాదు. కోహ్లీ రెండో పరుగు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆటపై కోహ్లీకి ఉన్న అంకితభావానికి ఇది మచ్చుతునక అని కొందరు అంటుంటే, కోహ్లీకి రెండు పరుగులు తీయడమంటే ఎంతో ఇష్టమని కామెంట్ చేస్తున్నారు.



Updated Date - 2020-10-22T22:14:51+05:30 IST