కీలక మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన Virat Kohli

ABN , First Publish Date - 2022-05-28T02:29:46+05:30 IST

బెంగళూరు జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ దారుణ వైఫల్యం కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఇక్కడి నరేంద్రమోదీ

కీలక మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన Virat Kohli

అహ్మదాబాద్: బెంగళూరు జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ దారుణ వైఫల్యం కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీ మరోమారు బ్యాటెత్తేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ అతి కష్టం మీద 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రజత్ పటీదార్ సెన్సేషనల్ సెంచరీకి తోడు దినేశ్ కార్తీక్ మెరుపులో విజయం సాధించి క్వాలిఫయర్‌లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో 8 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగులో కీపర్ శాంసన్‌కు దొరికిపోయాడు. 


 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరునే ఉంది. అయితే, ప్లే ఆఫ్స్‌లో మాత్రం గొప్ప రికార్డేమీ లేదు. 14 మ్యాచుల్లో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఈసారి ఐపీఎల్ కోహ్లీకి ఏమంత కలిసి రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచుల్లో మూడుసార్లు గోల్డెన్ డక్‌ అయ్యాడు. రెండు అర్ధ సెంచరీలు చేయగా అందులో ఒకటి ఐపీఎల్‌లోనే అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీ. అయితే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 22.73 సగటు, 115.99 స్ట్రైక్ రేట్‌తో 341 పరుగులు చేశాడు.  

Updated Date - 2022-05-28T02:29:46+05:30 IST