Advertisement
Advertisement
Abn logo
Advertisement

గడ్డు రోజులు ఎంతోకాలం ఉండవు.. హ్యాపీ బర్త్ డే కోహ్లీ

ముంబై: టీమిండియా రన్ మెషీన్, సారథి విరాట్ కోహ్లీ నేడు 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజా, మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ శుభాకాంక్షలతో సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. బీసీసీఐ కూడా కోహ్లీకి శుభాకాంక్షలు అందించింది.


‘‘23,159 అంతర్జాతీయ పరుగులు, కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలు, 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడు, టీమిండియా కెప్టెన్, ఆధునిక తరం బ్యాట్స్‌మన్‌లలో గొప్పవాడైన కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని పేర్కొంటూ ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో కోహ్లీ సాధించిన శతకం వీడియోను జతచేసింది.


టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. కోహ్లీకి బర్త్ డే విషెస్ చెబుతూ.. గడ్డు రోజులు ఎంతోకాలం ఉండబోవని, గట్టి మనుషులు మాత్రమే ఎల్లకాలం ఉంటారని అన్నాడు. తరానికొక్క ఆటగాడైన కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది మరింత బాగుండాలని ఆంకాంక్షించాడు.


సహచర ఆటగాడు అజింక్య రహానే ట్వీట్ చేస్తూ రాబోయే రోజులన్నీ కోహ్లీకి ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. నీలాంటి పెద్దన్న దొరికినందుకు తనకన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడని, తన కష్టనష్టాల్లో పక్కన నిలబడినందుకు కృతజ్ఞతలని పేర్కొన్న హైదరాబాద్ పేసర్.. ‘‘నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని కోరుకుంటున్నా, హ్యాపీ బర్త్ డే కింగ్’ అని ట్వీట్ చేశాడు. అలాగే, నవదీప్ సైనీ, వసీంజాఫర్ సహా పలువురు తాజా, మాజీ ఆటగాళ్లు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘‘ఆర్సీబీకి, నీ జట్టు సభ్యులకు, ప్రపంచంలోని అభిమానులందరికీ అన్నీ అయినందుకు థ్యాంక్యూ’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆర్సీబీతో కోహ్లీ మూమెంట్స్‌ను వీడియోను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement