Virat Kohli ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు

ABN , First Publish Date - 2022-05-20T23:48:06+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు తరపున 7 వేల

Virat Kohli ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు తరపున 7 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గురువారం గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


ఈ మ్యాచ్‌లో కోహ్లీ వ్యక్తిగత స్కోరు 57 పరుగులకు చేరినప్పుడు కోహ్లీ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. బెంగళూరు తరపున కోహ్లీ 7 వేల పరుగులు చేయగా, అందులో 6,600 పరుగులు ఐపీఎల్ సాధించగా, మిగతా పరుగులను చాంపియన్స్ లీగ్‌లో సాధించాడు. చాంపియన్స్ లీగ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. అంతేకాదు, లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ పేరే ముందువరుసలో ఉంది. 


కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధవన్ (6,205), రోహిత్ శర్మ (5,877), డేవిడ్ వార్నర్ (5,876), సురేశ్ రైనా (5,528), ఏబీ డివిలియర్స్ (5,162) ఉన్నారు. గుజరాత్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నప్పటికీ, శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. అలా, అయితేనే డుప్లెసిస్ సేన నాకౌట్‌కు వెళ్తుంది. లేదంటే ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. 

Updated Date - 2022-05-20T23:48:06+05:30 IST