IND vs WI T20s: విరాట్ కోహ్లీ లేకుండానే విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా..

ABN , First Publish Date - 2022-07-15T00:31:38+05:30 IST

బీసీసీఐలోని (BCCI) సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ (West Indies) జట్టుతో టీమిండియా (Team India) ఆడనున్న ఐదు టీ20ల సిరీస్‌కు..

IND vs WI T20s: విరాట్ కోహ్లీ లేకుండానే విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా..

బీసీసీఐలోని (BCCI) సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ (West Indies) జట్టుతో టీమిండియా (Team India) ఆడనున్న ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli), బుమ్రా (Jasprit Bumrah) ఇద్దరినీ ఈ టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ దూరం పెట్టింది. గత నెలలో గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ (KL Rahul) విండీస్ సిరీస్‌లో భాగం కానున్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు (R Ashwin) కూడా ఈ సిరీస్‌లో ఆడేందుకు అవకాశం దక్కింది. కుల్దీప్ యాదవ్ పేరును కూడా ప్రకటించినప్పటికీ అతను ఆడేది లేనిదీ అప్పటి అతని ఫిట్‌నెస్‌ ఆధారంగా నిర్ణయించే అవకాశముంది. కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే. 150 kmph బౌలింగ్‌తో ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు విండీస్‌తో జరిగే ఈ టీ20 సిరీస్‌లో చోటుదక్కలేదు.



చాహల్‌కు కూడా విశ్రాంతినిచ్చారు. ఈ సంవత్సరాంతంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు జట్టులో ఎవరిని ఉంచాలి, ఎవరిని పక్కన పెట్టాలనేది విండీస్‌తో జరిగే ఈ టీ20 సిరీస్‌ నిర్ణయించనుంది. ఈ కరేబియన్ జట్టుతో టీమిండియా మొత్తం ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో రెండు టీ20 మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి. ఇప్పటికే విండీస్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డేలకు శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.



హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్‌ ఇద్దరికీ వన్డేల్లో విశ్రాంతినిచ్చినప్పటికీ టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరినీ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియా రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడుతున్నాడు. కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం అతనికి తీవ్ర ప్రతికూల అంశంగా మారింది. కొందరు కోహ్లీని జట్టు నుంచి తప్పించాలనే ప్రతిపాదన చేసేంత వరకూ పరిస్థితి వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మ అలాంటి సమయంలో కోహ్లీకి అండగా నిలిచాడు.



వెస్టిండీస్‌తో 5 టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఇదే:

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవీష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

Updated Date - 2022-07-15T00:31:38+05:30 IST