IPL 2022: అరుదైన రికార్డుకు 52 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2022-04-12T22:20:03+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనతకు 52 పరుగుల దూరంలో ఉన్నాడు. చెన్నై

IPL 2022: అరుదైన రికార్డుకు 52 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనతకు 52 పరుగుల దూరంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు జరగనున్న మ్యాచ్‌లో ఆ 52 పరుగులు సాధిస్తే ఆ జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు.  6,389 పరుగులతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డులకెక్కిన కోహ్లీ 2016 సీజన్‌లో ఒకే ప్రత్యర్థిపై ఏకంగా 950 పరుగులు సాధించాడు.


ఇప్పుడు మరో 52 పరుగులు సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగుల సాధించిన తొలి క్రికెటర్‌గా, ఓవరాల్‌గా రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ సరసన నిలుస్తాడు. రోహిత్ శర్మ గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై వెయ్యికిపైగా పరుగులు సాధించాడు. 


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పాయింట్లతో ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. చెన్నై జట్టుగా నాలుగు వరుస పరాజయాలతో అట్టడుగున ఉంది. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులు సాధించిన కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.  


Updated Date - 2022-04-12T22:20:03+05:30 IST