కోహ్లీ ముంగిట ఆ రికార్డులు

ABN , First Publish Date - 2020-11-20T10:04:23+05:30 IST

క్రికెట్‌ మైదానంలో రికార్డులను సృష్టించడం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కొత్తేం కాదు. ఇప్పటికే అతడి ఖాతాలో ఇలాంటి ఫీట్లు కోకొల్లలు.

కోహ్లీ ముంగిట ఆ రికార్డులు

సిడ్నీ: క్రికెట్‌ మైదానంలో రికార్డులను సృష్టించడం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కొత్తేం కాదు. ఇప్పటికే అతడి ఖాతాలో ఇలాంటి ఫీట్లు కోకొల్లలు. అయితే వీటికి మరికొన్ని జత కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియా తో జరిగే వన్డే, టీ20 సిరీ్‌సల్లో కింగ్‌ కోహ్లీ బ్యాటింగ్‌ విన్యాసాలతో అదరగొడితే పలు రికార్డులు అతడి దరికి చేరనున్నాయి. ఆసీస్‌ జట్టుపై విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న కోహ్లీ ముందున్న ఆ రికార్డులేంటో ఓసారి గమనిస్తే..


అత్యంత వేగంగా 12 వేల రన్స్‌: వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ మరో 133 పరుగులు చేస్తే చాలు.. వేగంగా 12 వేల పరుగులను సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతను 239 ఇన్నింగ్స్‌లో 11,867 రన్స్‌తో ఉన్నాడు. సచిన్‌ ఈ ఫీట్‌ సాధించేందుకు 300 ఇన్నింగ్స్‌ తీసుకున్నాడు.


పాంటింగ్‌ను దాటేందుకు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 71 శతకాలు బాదాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 70 సెంచరీలున్నాయి. దీంతో ఆసీస్‌ తో ఆడే ఒక టెస్టు, మూడేసి వన్డే, టీ20ల్లో మరో రెండు సెంచరీలు సాధిస్తే రికీని అధిగమించడంతో పాటు సచిన్‌ (100) తర్వాత స్థానంలో నిలుస్తాడు.


22 వేల రన్స్‌:

కోహ్లీ 12 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 416 మ్యాచ్‌ల్లో 21,901 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.  మరో 99 పరుగులు చేస్తే 22 వేల రన్స్‌ మార్కు చేరుకుంటా డు. ఈ జాబితాలో విరాట్‌కంటే ముందు ఏడుగురున్నారు.   సచిన్‌ 34,357 (664 మ్యాచ్‌లు)రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు.


ధోనీ, సచిన్‌, దాదా సరసన: భారత జట్టు తరఫున 250 వన్డేలు ఆడిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ కేవ లం రెండు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నాడు. సచిన్‌ (463), ధోనీ (350), ద్రావిడ్‌ (344), అజరుద్దీన్‌ (334), గంగూలీ (311), యువరాజ్‌ సింగ్‌ (304), అనిల్‌కుంబ్లే (271), సెహ్వాగ్‌ (251) ఈ క్లబ్‌లో ఉన్నారు.


ఆత్మవిశ్వాసానికి ప్రతీక ..

న్యూఢిల్లీ: ఫిట్‌నెస్‌ గురించి విరాట్‌ కోహ్లీ తీసుకునే శ్రద్ధ అద్భుతమని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన ఆట ద్వారా, ఫిట్‌నెస్‌ ద్వారా రాబోయే తరం ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఉండబోతోందో నిరూపించాడని అన్నాడు. బాలీవుడ్‌ నటి నేహా ధూపియా ఆడియో షోలో కపిల్‌ మాట్లాడుతూ..‘విరాట్‌ తదుపరి తరం ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాడు. క్రీడాకారుడికి దేహదారుఢ్యం ఎంత ముఖ్యమో అతడు చాటి చెప్పాడు’ అని అన్నాడు. 


అతను లేకుంటే అదనపు ఒత్తిడే 

సిడ్నీ: మూడు టెస్ట్‌లకు కెప్టెన్‌ కోహ్లీ అందుబాటులో లేకపోవడం భారత జట్టు లోని ఇతర ఆటగాళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ అన్నాడు. ‘కోహ్లీ గైర్హాజరీలో ఒకవేళ రహానె సారథ్య బాధ్యతలు అందుకుంటే అది అతడిపైనా మరింత ఒత్తిడి పెంచుతుంది. అలానే 4వ స్థానంలో ఎవరిని ఆడిం చాలనేది కూడా సమస్యే’ అని పాంటింగ్‌ వివరించాడు. ఇక, టెస్టు సిరీ్‌సలో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలున్నాయని పాక్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌రాజా అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ బౌలింగ్‌ను సమర్థ ంగా ఎదుర్కోగల లైనప్‌ భారత్‌కు ఉందని అన్నాడు.

Updated Date - 2020-11-20T10:04:23+05:30 IST