‘హత్రాస్‌’ నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2020-09-30T09:29:24+05:30 IST

హత్రాస్‌ సామూహిక అత్యాచార ఘటనపై విరాట్‌ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అది క్రూరత్వానికి పరాకాష్ట అని అన్నాడు. బాధితురాలికి ...

‘హత్రాస్‌’ నిందితులను కఠినంగా శిక్షించాలి

అబుదాబి: హత్రాస్‌ సామూహిక అత్యాచార ఘటనపై విరాట్‌ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అది క్రూరత్వానికి పరాకాష్ట అని అన్నాడు. బాధితురాలికి న్యాయం జరగాలని ట్వీట్‌ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రా స్‌లో 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అతి క్రూరంగా ఆమె నాలుకను కోసేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలు ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ‘హత్రా్‌సలో జరిగిన ఘటన అమానవీయం. క్రూరత్వానికే పరాకాష్ట. దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని విరాట్‌ మంగళవారం ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-09-30T09:29:24+05:30 IST