కరోనాపై కలసికట్టుగా పోరాడండి!

ABN , First Publish Date - 2020-04-03T09:55:57+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచడంపై విరాట్‌ కోహ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. వైరస్‌పై పోరాటంలో అందరూ కలిసి కట్టుగా ...

కరోనాపై కలసికట్టుగా పోరాడండి!

ప్రజలకు కోహ్లీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచడంపై విరాట్‌ కోహ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. వైరస్‌పై పోరాటంలో అందరూ కలిసి కట్టుగా పోరాడాలన్నాడు. ‘ప్రస్తుతం ఇంట్లోనే ఉండి మహమ్మారిపై పోరాడుతున్నాం. 80 శాతం మంది ఎంతో సీరియస్‌గా తీసుకున్నా.. 20 శాతం మంది అమలు చేయక పోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయ’ని ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో కోహ్లీ చెప్పాడు. ఇక కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. 2014 ఇంగ్లండ్‌ టూర్‌ తన కెరీర్‌లో దారుణ వైఫల్యమని చెప్పాడు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇక తన ముద్దుపేరు ‘చీకూ’ను ఫేమస్‌ చేసింది మాత్రం ధోనీనే అని చెప్పాడు. తన వేషభాషలు కార్టూన్‌ క్యారెక్టర్‌లా ఉండడంతో రంజీ కోచ్‌ తనకు ఆ పేరు పెట్టినట్టు తెలిపాడు. 

Updated Date - 2020-04-03T09:55:57+05:30 IST