విరాట్‌ @15 కోట్ల ఫాలోవర్స్‌

ABN , First Publish Date - 2021-09-04T08:02:59+05:30 IST

సోషల్‌ మీడియాలోనూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు.

విరాట్‌ @15 కోట్ల ఫాలోవర్స్‌

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలోనూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ ఏకంగా 15 కోట్ల (150 మిలియన్లు) ఫాలోవర్స్‌ మార్క్‌కు చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా, తొలి ఆసియన్‌గా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో 15 కోట్ల మంది ఫ్యాన్స్‌ కలిగిన నాలుగో స్పోర్ట్స్‌ సెలెబ్రిటీ కోహ్లీ కావడం విశేషం. సాకర్‌ స్టార్స్‌ క్రిస్టియానో రొనాల్డో (33.7 కోట్లు), మెస్సీ (26 కోట్లు), నెమార్‌ (16 కోట్లు) టాప్‌-3లో ఉన్నారు. 

Updated Date - 2021-09-04T08:02:59+05:30 IST