అప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడు లేస్తున్నాయ్: కోహ్లీ

ABN , First Publish Date - 2021-03-04T00:03:50+05:30 IST

మొతేరా పిచ్‌ విషయమై పలువురు విదేశీ ఆటగాళ్లు పెదవి విరవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించారు.

అప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడు లేస్తున్నాయ్: కోహ్లీ

అహ్మదాబాద్: మొతేరా పిచ్‌ విషయమై పలువురు విదేశీ ఆటగాళ్లు పెదవి విరవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించారు. స్పిన్ పిచ్‌లపై మ్యాచ్ రెండు రోజుల్లో ముగియడంతో విమర్శలు చేస్తున్నవారు.. తాము న్యూజిలాండ్‌లో సీమ్(ఫాస్ట్), బౌన్సీ పిచ్‌లపై మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నప్పుడు ఎందుకు ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదని కోహ్లీ ప్రశ్నించారు. అప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడు లేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. "సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై జట్లు 40-45 మధ్య ఆలౌట్ అయిన ఎవరు పట్టించుకోరు. అంతేందుకు మేము కివీస్ పర్యటన(2020)లో ఓ టెస్టు మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల లోపే చేజార్చుకున్నాం. అప్పుడు ఎవరూ కూడా ఆ పిచ్ గురించి మాట్లాడాలేదు. కేవలం భారత ఆటగాళ్ల తప్పిదం వల్లే మ్యాచ్ ఓడినట్లు రాశారు." అని కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. 


కానీ, మొతేరాలో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించడంతో మ్యాచ్ రెండు రోజుల్లో ముగియడంపై ఇంత రాద్ధాంతం చేయడం ఏంటని మండిపడ్డారు. ఇదిలాఉంటే.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టు ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉంది. రేపటి(గురువారం) నుంచి మొతేరా వేదికగానే ఆఖరిదైన నాల్గో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌ బేర్త్ ఖాయం అవుతుంది. డ్రా చేసుకున్న ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ఓడిపోతే మాత్రం సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది.  

Updated Date - 2021-03-04T00:03:50+05:30 IST