విరసం ఆన్‌లైన్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-07-04T06:30:53+05:30 IST

జూలై 4 విప్లవ రచయితల సంఘం (విరసం) 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండురోజుల ఆన్‌లైన్‌ సమావేశం (జూమ్‌) జరగనుంది. శనివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభ...

విరసం ఆన్‌లైన్‌ సమావేశం

జూలై 4 విప్లవ రచయితల సంఘం (విరసం) 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండురోజుల ఆన్‌లైన్‌ సమావేశం (జూమ్‌) జరగనుంది. శనివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభ సమావేశంలో మీనా కందసామి ప్రారంభోపన్యాసం, అరసవిల్లి కృష్ణ అధ్యక్షోపన్యాసం ఉంటాయి. యాభై ఏళ్ళ విప్లవ సాహిత్య విమర్శ అంశంపై ఎన్‌. వేణుగోపాల్‌ ప్రసంగిస్తారు. క్రాంతి అధ్యక్షత వహిస్తారు. జులై 5 ఆదివారం ఉదయం 10గం.లకు ‘కరోనా విపత్తు–ప్రపంచ రాజకీయార్థిక సంక్షోభం’ అంశంపై అశోక్‌ కుంబము, ‘సిఎఎ వ్యతిరేక ఉద్యమకారులపై రాజ్య దమనకాండ’ అంశంపై చైతన్య, ‘దేశవ్యాప్తంగా బుద్ధిజీవులపై నిర్బంధం–మంద్రస్థాయి యుద్ధం’ అంశంపై పి. వరలక్ష్మి ప్రసంగాలు చేస్తారు. బాసిత్‌ అధ్యక్షులు. సాయంత్రం 5గంటలకు శివరాత్రి సుధాకర్‌ అధ్యక్షతన జరిగే మూడవ సమావేశంలో ‘వర్తమానకాలంలో విప్లవ సాహిత్యోద్యమం ముందున్న సవాళ్ళు’ అంశంపై రివేరా, ‘40 ఏళ్ళ దండకారణ్యం–వర్గపోరాటం’ అంశంపై పాణి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ‘విప్లవ కథ (2011–2019)’ పుస్తకాన్ని బజారా, ‘కవి కాశీం (కవిత్వ విశ్లేషణ)’ పుస్తకాన్ని కె.శ్రీనివాస్‌ ఆవిష్కరిస్తారు. విరసం, ప్రజా కళామండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌లోని విరసం పేజీనుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.


– విప్లవ రచయితల సంఘం

Updated Date - 2020-07-04T06:30:53+05:30 IST