viral video: వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న పెద్ద పులి.. ఇళ్లకే పరిమితమైన జనాలు.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-06-19T17:50:59+05:30 IST

పెద్ద పులిని నేరుగా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. జూలో కటకటాల వెనక నుంచి చూడడానికి కూడా భయపడుతుంటాం.

viral video: వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న పెద్ద పులి.. ఇళ్లకే పరిమితమైన జనాలు.. ఎక్కడంటే..

పెద్ద పులిని నేరుగా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. జూలో కటకటాల వెనక నుంచి చూడడానికి కూడా భయపడుతుంటాం. అలాంటిది నేరుగా మన వీధుల్లోనే పెద్దపులి సంచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది.  మెక్సికోలోని టెక్యూలా వాసులకు అలాంటి అనుభవమే ఎదురైంది. తమ వీధిలో తిరుగుతున్న పెద్దపులిని చూసి వారందరూ భయపడ్డారు. తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. 


మెక్సికోలోని నయరిటీ స్టేట్, టెక్యులా వద్ద బుధవారం ఉదయం ఓ పెద్దపులి వీధుల్లో తిరుగుతూ కనిపించింది. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వీధుల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. 

Updated Date - 2022-06-19T17:50:59+05:30 IST