Viral Video: ఈ ఏనుగు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. తొండంతో మొద్దును తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2022-04-22T21:27:11+05:30 IST

రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.

Viral Video: ఈ ఏనుగు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. తొండంతో మొద్దును తీసుకెళ్లి..

రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. అయితే అన్నింటిలోకీ ఏనుగులకు సంబంధించిన వీడియోలు మరింతగా ఆకట్టుకుంటాయి. అత్యంత భారీ శరీరంతో ఉండే ఏనుగులను మనుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జంతు ప్రపంచంలో అత్యంత తెలివైన జీవులలో ఏనుగు కూడా ఒకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో ఆ విషయాన్ని రుజువు చేసేదిగా ఉంది. 


ఇది కూడా చదవండి:

పెళ్లి వేదికపై వధూవరులిద్దరూ చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు.. మొదట అంతా విస్మయం.. ఆ తర్వాత..


ఆ వీడియోలో ఏనుగు ఓ భారీ దుంగను ఒక పొడవైన స్తంభంపై ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. కొంత ప్రయత్నం తర్వాత విజయవంతంగా దానిని ఆ స్తంభంపై బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్‌గా పెట్టింది. ఈ వీడియోను  రెక్స్ చాప్‌మన్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికి నాలుగు లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకుంది. ఎంతో మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-04-22T21:27:11+05:30 IST