Viral Video: నీటిలో ఉన్న మొసలిని అమాంతం ఎత్తిపడేసిన చిరుతపులి.. భీకర ఫైటింగ్!

ABN , First Publish Date - 2022-08-18T22:06:13+05:30 IST

నీళ్లలో మొసలి(crocodile) బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏనుగును సైతం అమాంతం పట్టిలాగేస్తుంది

Viral Video: నీటిలో ఉన్న మొసలిని అమాంతం ఎత్తిపడేసిన చిరుతపులి.. భీకర ఫైటింగ్!

న్యూఢిల్లీ: నీళ్లలో మొసలి(crocodile) బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏనుగును సైతం అమాంతం పట్టిలాగేస్తుంది. నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని చెబుతారు. అలాంటి మొసలి నీటిలో ఉండగానే అంటే తన స్థానంలో ఉండగానే ఓ చిరుతపులి (Jaguar) అమాంతం దూకి దాని మెడపట్టుకుని బయలకు లాక్కొచ్చింది. ఈ క్రమంలో రెండింటి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి పులిదే పై చేయి అయింది. విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


ఫైజన్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో రెండేళ్ల పాతది. వాషి హయత్లార్ అనే ట్విట్టర్ యూజర్ రెండు సంవత్సరాల క్రితం దీనిని పోస్టు చేయగా, తాజాగా ఇది వైరల్ అవుతోంది. నది ఒడ్డున పొదల్లో నక్కిన ఓ జాగ్వార్ నదిలో ఈదులాడుతున్న మొసలిని చూసింది. దానిని పట్టేయాలని నిర్ణయించుకున్న చిరుత ఏమాత్రం అలికిడి చేయకుండా సమయం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూసింది. అనుకున్న సమయం రాగానే ఒడ్డు నుంచి అమాంతం నీళ్లలోకి దూకి దాని మెడను పట్టుకుంది. మొసలి మెడ పులి నోటికి చిక్కడంతో విడిపించుకునేందుకు పెనుగులాడింది.


ఈ క్రమంలో రెండింటి మధ్య భీకర యుద్ధం జరిగింది. నీళ్లలోనే ఉన్నప్పటికీ చిరుత బలం ముందు మొసలి ఆటలు సాగలేదు. దీంతో మొసలిని ఈడ్చుకుంటూ పులి ఒడ్డుకు చేరుకుంది. 42 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.6 మిలియన్ల వ్యూస్ లభించాయి. 27 వేల మంది లైక్ చేయగా, 4800 మందికి పైగా రీట్వీట్ చేశారు. కామెంట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. జాగ్వార్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, జాగ్వార్ అన్నింటికంటే బలమైనదని ఒకరు  కామెంట్ చేస్తే.. పులి చాలా ఆకలితో ఉండి ఉంటుందని, దానికి డిన్నర్‌కు ఆహారం దొరికేసిందని మరికొందరు రాసుకొచ్చారు.  ఈ నెల మొదట్లో ఇలాంటిదే ఒక వీడియో వైరల్ అయింది. అమెరికాలోని సీవరల్డ్ (Sea World)లో రెండు తిమింగలాలు భీకరంగా తలపడ్డాయి. అప్పట్లో ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.



Updated Date - 2022-08-18T22:06:13+05:30 IST