Viral Video: వధూవరులిద్దరూ ముద్దుపెట్టుకోవాలి.. ఓ అమ్మాయి తండ్రి వెరైటీ కోరిక.. ఆ కొత్త పెళ్లికొడుకు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-26T22:54:20+05:30 IST

ఆ తండ్రి అంగరంగవైభవంగా కూతురి పెళ్లి చేశాడు. స్టేజిమీద కూతురిని, అల్లుడిని చూసి తెగ సంబరపడిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లి తంతు ముగిశాక అమ్మాయి తండ్రి ఓ వెరైటీ కోరిక కోరాడు. వధూవరులిద్దరూ ముద్దుపెట్టుకోవాలని అడిగాడు

Viral Video: వధూవరులిద్దరూ ముద్దుపెట్టుకోవాలి.. ఓ అమ్మాయి తండ్రి వెరైటీ కోరిక.. ఆ కొత్త పెళ్లికొడుకు ఏం చేశాడంటే..

ఇంటర్‌నెట్ డెస్క్: ఆ తండ్రి అంగరంగవైభవంగా కూతురి పెళ్లి చేశాడు. స్టేజిమీద కూతురిని, అల్లుడిని చూసి తెగ సంబరపడిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లి తంతు ముగిశాక అమ్మాయి తండ్రి ఓ వెరైటీ కోరిక కోరాడు. వధూవరులిద్దరూ ముద్దుపెట్టుకోవాలని అడిగాడు. అపుడు ఆ కొత్త పెళ్లికొడుకు ఏం చేశాడంటే..


షట్టర్‌డౌన్ ఫోటోగ్రఫీ అనే ఇన్‌స్టాగ్రాం యూజర్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వధూవరులను ముద్దు పెట్టుకోమని చెప్పాల్సిందిగా వధువు తండ్రి పంతులుతో చెప్పడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆయన మాట విన్న పంతులు కాస్తంత సిగ్గుపడుతూ.. నా తరపున కూడా మీరే ఆ ముక్క వారికి చెప్పండి అన్నాడు. వారి సంభాషణ విన్న వరుడు వధువు అదరాలపై సున్నితంగా చుంబించి భార్య తండ్రి ముచ్చట తీర్చాడు. వధువు కూడా భర్తకు సహకరించింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.


ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పోస్టు చేసినప్పటినుంచి 28 వేల మంది ఈ వీడియోను చూశారు. కొందరు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. వీడియో చాలా బాగుందని అన్నారు. ఇంకొక యూజర్ హిందూ సంప్రదాయాలను అవమానించినట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.



Updated Date - 2021-11-26T22:54:20+05:30 IST