Advertisement
Advertisement
Abn logo
Advertisement

గదిలో ఒంటరిగా పడుకున్న యువతి.. అర్ధరాత్రి భారీ శబ్దం.. ఉలిక్కిపడి లేచి చూస్తే పక్కలో కనిపించినదాన్ని చూసి..

ఇంటర్నెట్ డెస్క్: రోజంతా బిజీగా గడిపిన ఆమె.. పని ఒత్తిడితో బాగా అలసిపోయింది. చీకటి పడటంతో డిన్నర్ చేసి, సరాసరి రూంలోకి వెళ్లి బెడ్‌పై వాలిపోయింది. పక్కన ఓ భవన నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ.. ఆ రోజుకు మట్టుకు అక్కడ నుంచి ఎటువంటి శబ్దాలు రాలేదు. దీంతో ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది. ఇంతలో భారీ శబ్దం కావడంతో.. ఆమె ఉలిక్కిపడి లేచింది. బెడ్‌పై ఎవరో ఒక్కసారిగా దూకినట్టు అనిపించడంతో ఆమె భయాందోళలను గురైంది. అనంతరం పిల్లోపై ఉన్న దాన్ని చూసి షాకైంది. ఈ క్రమంలోనే హుటాహుటిన పోలీసులను సంప్రదించింది. అనంతరం ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..కెనడాకు చెందిన రూత్ హామిల్టన్ అనే మహిళ ఎప్పటిలాగే తన పనిని పూర్తి చేసుకుని, రాత్రైన తర్వాత భోజనం చేసి పడక గదికి వెళ్లి పడుకుంది. ఆమె గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భారీ శబ్దం అయింది. దీంతో ఆమె ఉలిక్కిపడి నిద్రలేచింది. అనంతరం తన ఇంటి పై కప్పుకు పెద్ద కన్నం ఉండటం చూసి ఒక్కసారిగా కంగారు పడింది. అంతేకాకుండా తన బెడ్‌పై ఎవరో ఎగిరి దూకినట్టు అనిపించడంతో బెడ్‌పైకి చూసింది. ఆ తర్వాత పిల్లోపై ఉన్న పడి ఉన్న రాయిని చూసి షాకైంది. ఈ క్రమంలో ఆమె వెంటనే పోలీసులను సంప్రదించి, వారికి విషయం చెప్పింది. దీంతో ఎక్వైరీ చేసిన పోలీసులు.. చుట్టుపక్కల ఎటువంటి కన్‌స్ట్రక్షన్ పనులు జరగడం లేదని, పెలుడు పదార్థాలను ఉపయోగించి బండరాళ్లను ఎవరూ పగలగొట్టలేదంటూ ఆమెకు బదులిచ్చారు. దీంతో ఆమెకు విషయం అర్థమైంది. అంతరిక్షం నుంచి చిన్నపాటి రాయి తన ఇంట్లో పడినట్లు గ్రహించింది. ఆ రాయిని ఆకాశం తనకు పంపిన గిఫ్ట్‌గా భావించి.. దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంది. కాగా.. అంతరిక్షం నుంచి వచ్చిపడ్డ ఆ శిల వల్ల తనకు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అయింది. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement