వారు వీఐపీలు కాదు దొంగలు.. కార్లలో వచ్చి వేటిని దొంగిలిస్తారో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-04-15T08:32:34+05:30 IST

మీరు అనేక దొంగతనాల గురించి విని ఉంటారు. కొందరు డబ్బు, నగలు దొంగిలిస్తారు. కొందరు ఖరీదైన వస్తువులు, బైక్‌లు, కార్లు దొంగిలిస్తారు. కానీ రాజస్థాన్‌లోని బార్మర్‌లోని సరిహద్దు ప్రాంతంలో కొందరు వ్యక్తులు మేకలను హైటెక్ పద్ధతిలో దొంగిలిస్తున్నారు. స్కార్పియో వంటి లగ్జరీ వాహనాల్లో వచ్చిన వారు మేకలను దొంగిలిస్తున్నారు..

వారు వీఐపీలు కాదు దొంగలు.. కార్లలో వచ్చి వేటిని దొంగిలిస్తారో తెలిస్తే షాక్!

మీరు అనేక దొంగతనాల గురించి విని ఉంటారు. కొందరు డబ్బు, నగలు దొంగిలిస్తారు. కొందరు ఖరీదైన వస్తువులు, బైక్‌లు, కార్లు దొంగిలిస్తారు. కానీ రాజస్థాన్‌లోని బార్మర్‌లోని సరిహద్దు ప్రాంతంలో కొందరు వ్యక్తులు మేకలను హైటెక్ పద్ధతిలో దొంగిలిస్తున్నారు. స్కార్పియో వంటి లగ్జరీ వాహనాల్లో వచ్చిన వారు మేకలను దొంగిలిస్తున్నారు. లగ్జరీ వాహనాల్లో మేకలను తరలించడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు. 


వివరాల్లోకి వెళితే.. బార్మర్‌ జిల్లాలో మేకల దొంగతనాలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో మేకల యజమానులు నిఘా వేశారు. తాజాగా మేకలను దొంగిలించి స్కార్పియో వాహనంలో పారిపోతున్న వ్యక్తులను బర్మార్‌లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు పట్టుకున్నారు. 40 కిలోమీటర్లు వెంబడించి మరీ వారిని పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు స్కార్పియోలో వచ్చి పొలంలో మేత మేస్తున్న ఐదు మేకలను కారులో వేసుకుని బయల్దేరారు. 


ఆ ఉదంతాన్ని ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు చెప్పాడు. దాంతో వారందరూ వాహనాల్లో వారిని వెంబడించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా నిందితులు వెంటపడ్డారు. దాదాపు 40-50 కిలోమీటర్లు వెంబడించి గ్రామస్తులు, పోలీసులు దొంగలను పట్టుకుని మేకలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఒక్క బార్మర్ జిల్లాలోనే దాదాపు 2 వేల మేకలు కనిపించకుండా పోయాయి. 


Updated Date - 2022-04-15T08:32:34+05:30 IST