వీఐపీలకే స్వామి దర్శనాలా.... ధ్వజమెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-03-13T00:00:24+05:30 IST

వీఐపీలకే స్వామివారి దర్శనాలా... సామాన్యులకు దైవదర్శనం నిలిపివేస్తారా అంటూ శనివారం ద్వారకాతిరుమల చినవెంకన్న భక్తులు ధ్వజమెత్తారు.

వీఐపీలకే స్వామి దర్శనాలా.... ధ్వజమెత్తిన భక్తులు

ద్వారకాతిరుమల: వీఐపీలకే స్వామివారి దర్శనాలా... సామాన్యులకు దైవదర్శనం నిలిపివేస్తారా అంటూ శనివారం ద్వారకాతిరుమల చినవెంకన్న భక్తులు ధ్వజమెత్తారు. వీఐపీల రాకకోసం గంటకు పైగా  క్యూలైన్లను నిలుపుదల చేశారు. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దేవస్థానంలో జరిగే పలు ప్రారంభోత్సవాల సందర్భంగా ముందుగా స్వామి దర్శనానికి వచ్చిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవదాయశాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్‌ల ముందే భక్తులు ధ్వజమెత్తారు. క్యూలైన్లలో ఉన్న భక్తుల కేకలతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  మంత్రులు భక్తుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు భక్తులను సైతం దైవదర్శనానికి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గందరగోళంలో మంత్రుల వెంట ఉన్న వైసీపీ నాయకుల జేబులు ఖాళీ అయ్యాయి. జేబుదొంగలు ఈ రద్దీలో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. 

Updated Date - 2022-03-13T00:00:24+05:30 IST