శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ రద్దు: ధర్మారెడ్డి

ABN , First Publish Date - 2022-05-14T01:04:15+05:30 IST

సవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ రద్దు: ధర్మారెడ్డి

తిరుమల: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేశామన్నారు. తద్వారా ఎక్కువమంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామన్నారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ వద్ద వైభవంగా నిర్వహిస్తామన్నారు. పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

Read more