Bihar: ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లిన మూడేళ్ల బాలిక.. ఏడుస్తూ తిరిగి రావడంతో నాయనమ్మలో కంగారు.. ఏమైందని అడిగితే..

ABN , First Publish Date - 2022-07-23T20:20:47+05:30 IST

చిన్నపిల్లలు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ పక్కింటికీ కూడా వెళ్తుంటారు. ఇది సహజమే. అందరిలాగే మూడేళ్ల చిన్నారి కూడా ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. అలా వెళ్లిన అమ్మాయి.. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చిం

Bihar: ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లిన మూడేళ్ల బాలిక.. ఏడుస్తూ తిరిగి రావడంతో నాయనమ్మలో కంగారు.. ఏమైందని అడిగితే..

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపిల్లలు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ పక్కింటికీ కూడా వెళ్తుంటారు. ఇది సహజమే. అందరిలాగే మూడేళ్ల చిన్నారి కూడా ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. అలా వెళ్లిన అమ్మాయి.. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది. అది తన నాయనమ్మ చూసి కంగారు పడింది. వెంటనే దగ్గరకు తీసుకుని ఏం జరిగిందని అడిగింది. చిన్నారి మాటలు విని ఆగ్రహానికి లోనైంది. వెంటనే పక్కింటికి వెళ్లింది. అక్కడ జరిగిన ఘటనతో షాకైంది. ఆ తర్వాత ఈ ఘటన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బిహార్‌(Bihar)లోని భోజ్‌పూర్(Bhojpur)కు చెందిన నిత్య కుమారి అనే చిన్నారికి ప్రస్తుతం మూడేళ్లు. ఎప్పటిలాగే ఈ చిన్నారి తన ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ.. పక్కనే ఉన్న ఇంటికి వెళ్లింది. దీంతో పక్కింట్లో ఉన్న వ్యక్తి ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. చేయి చేసుకున్నాడు. అతడి ప్రవర్తనతో బెదిరిపోయిన అమ్మాయి.. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది. అది చూసి ఆ చిన్నారి నాయనమ్మ రేణూ దేవి కంగారు పడింది. అనంతరం విషయం తెలుసుకుని పక్కింటి వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మనవరాలిని కొట్టడానికి గల కారణమేంటో తెలుసుకునేందుకు పక్కింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెపై కూడా అతడు దాడి చేశాడు. విషయం తెలిసి నిత్య కుమారి తల్లి ఖుష్బూ కుమారి కూడా అక్కడకు వెళ్లింది. ఆమెపై కూడా అతడు దాడికి తెగబడ్డాడు. పక్కింటి వ్యక్తి చేతిలో తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై పోలీసుకు(Police)ల సమాచారం అందడంతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-07-23T20:20:47+05:30 IST