ప్రకాశం: ప్రదేశం ఏదైనా వైసీపీ నేతల దౌర్జన్యం ఆగడం లేదు. తాజాగా పామూరులో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. పామూరులో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎంపీడీఓ ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని ఉన్నతాధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉష విచారణ చేపట్టారు. ఎంపీడీవో వ్యవహారశైలిపై విచారణ జరుగుతున్నట్లు వైసీపీ నాయకులకు సమాచారం అందింది. దీంతో తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడి టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు.