నల్గొండజిల్లా: వాడపల్లిలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-04-10T17:39:47+05:30 IST

వాడపల్లిలో ముగ్గు మిల్లుల యాజమాన్యం లాక్ డౌన్ భేఖాతరు చేసింది.

నల్గొండజిల్లా: వాడపల్లిలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

నల్గొండ జిల్లా: వాడపల్లిలో ముగ్గు మిల్లుల యాజమాన్యం లాక్ డౌన్ భేఖాతరు చేసింది. యధావిధిగా ఉత్పత్తిని కొనసాగిస్తోంది. 340 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులంతా సామాజిక దూరం పాటించడంలేదు. పైగా వారికి యాజమాన్యం మాస్క్‌లు పంపిణీ చేయలేదు. ఈ తీరును స్థానికులు నిరసిస్తున్నారు.


తమకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని అందుకే నడుపుతున్నామని ముగ్గు మిల్లుల యాజమాన్యాలు చెప్పడం గమనార్హం. మైనింగ్ శాఖ పర్మిషన్లు, లీజు ఒప్పందాలు లేకపోయినా అధికారులు పట్టించుకోని వైఖరితోనే ఇదంతా జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తక్షణం ముగ్గు మిల్లులను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Updated Date - 2020-04-10T17:39:47+05:30 IST