లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన : కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-03-31T10:50:45+05:30 IST

ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తాడేపల్లిగూడెం

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన : కేసులు నమోదు

తాడేపల్లిగూడెం రూరల్‌/కొవ్వూరు/ పెనుగొండ/పెనుమంట్ర/ నిడద వోలు/ఆచంట/పాలకొల్లు టౌన్‌/ఏలూరు క్రైం, మార్చి 30 : ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు పేర్కొన్నారు. తాడేపల్లి గూడెం సర్కిల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో 41 మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేసినట్టు ఆయన తెలిపారు. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు, రూ.17,900 జరిమానాలు విధించామన్నారు.


కొవ్వూరు పట్టణ, మండలంలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న 15 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె. వెంకట రమణ తెలిపారు. సీతంపేట సెంటర్‌లో మరో పదిమందిపై కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ, ట్రైనీ డీఎస్పీ కేవీ మహేశ్‌ తెలిపారు. ప్రభుత్వ  నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న 25 మందిపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేసినట్టు పెనుగొండ ఎస్‌ఐ పి.నాగరాజు  తెలిపారు. ప్రభు త్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ వాహనాలపై తిరుగుతున్న వారికి మార్టేరు సెంటర్‌లో పెనుమంట్ర ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌ జరిమానాలు విధించారు.


నిడదవోలులో లాక్‌ డౌన్‌ అతిక్రమించి మోటారు సైకిల్‌పై తిరుగుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె.ప్రసాద్‌ తెలిపారు. ఆచంట మండలం వేమవరం లింగరాజు గట్టు వద్ద రామాలయం సమీపంలో గుమిగూడిన   21 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-31T10:50:45+05:30 IST