లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-06-15T05:16:26+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన
టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంట్లో డ్యాన్సులు చేస్తున్న హిజ్రాలు

  • టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంట్లో రాత్రివేళ హిజ్రాల అశ్లీల నృత్యాలు 


దోమ: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంట్లో నిర్వహించిన వేడుకలో హిజ్రాలతో డీజే డ్యాన్సులు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంటిలో నిర్వహించిన ఓ శుభకార్యానికి లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి హిజ్రాలతో ఆశ్లీల డ్యాన్సులు చేయించారు. ఈనెల 11న రాత్రి హిజ్రాలను నగరం నుంచి రప్పించి ఎంజాయ్‌ చేశారు. అదే రోజు రాత్రి పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీరా స్థానికులు తీసిన వీడియో క్లీప్స్‌ సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-06-15T05:16:26+05:30 IST