కేంద్ర చట్టాలతో రైతు సంక్షేమానికి విఘాతం

ABN , First Publish Date - 2021-06-22T06:48:44+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నూతన సాగు చట్టాలతో రైతుల సంక్షేమా నికి విఘాతం కలుగుతోందని నకిరేకల్‌ ఎమ్యేల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

కేంద్ర చట్టాలతో రైతు సంక్షేమానికి విఘాతం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల, జూన్‌21: కేంద్ర ప్రభుత్వ నూతన సాగు చట్టాలతో రైతుల సంక్షేమా నికి విఘాతం కలుగుతోందని నకిరేకల్‌ ఎమ్యేల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం చిట్యాలలో రైతు వేదిక నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలతో రైతులకు గిట్టుబాటు ధర లభించదనీ, ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా నిలబడుతుందన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాంగా ఇతర పంటలను, కూరగాయలను పండిస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు.  చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్‌కు కలిపి సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెల్ల లింగస్వామి ఎమ్యేల్యేకు నాగలి బహూకరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కూరెల్ల లింగస్వామి, మార్కెట్‌ చైర్మన్‌ జడల ఆదిమల్లయ్య, ఎంపీపీ కొలను సునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, సింగిల్‌విండో చైర్మన్లు సుంకరి మల్లేషంగౌడ్‌, రాదారపు బిక్షం, వైస్‌ చైర్మన్‌ మెండె సైదులు తహీసీల్దార్‌ కృష్ణారెడి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:48:44+05:30 IST