నాపై ఎమ్మెల్యే చెప్పు ఎత్తాడు... దానికి ఎంపీనే సాక్ష్యం: రైతు Narendra

ABN , First Publish Date - 2022-01-19T17:09:24+05:30 IST

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పీఏపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన రైతు నరేంద్ర బెయిల్‌పై విడుదలయ్యారు.

నాపై ఎమ్మెల్యే చెప్పు ఎత్తాడు... దానికి ఎంపీనే సాక్ష్యం: రైతు Narendra

గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పీఏపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన రైతు నరేంద్ర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ పంట కొనుగోలులో రైతుల ఇబ్బందులు ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులుకు చెప్పుకున్నామని అన్నారు. పంట కొనుగోలు చేయడం లేదని ఎంపీకి చెప్పడంతో ఎమ్మెల్యే బొల్లాకు కోపం వచ్చిందని తెలిపారు. ‘‘నాపై చెప్పుతో కొట్టబోయి పచ్చి బూతులు తిట్టాడు. రైతులు అంటే ఎమ్మెల్యే బొల్లాకు చులకన బావం. ఎన్నికలలో ప్రజలందరినీ కొనుగోలు చేశాను. నేను ఏది చేసిన పడి ఉండాలనేదే బొల్లా భావన’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నేను వైఎస్ కోసం పని చేశాను, జగన్ రెడ్డి కోసం పని చేశాను. సోసైటీ  ప్రెసిడెంట్‌గా కూడా పని చేశాను. నాపై ఎమ్మెల్యే చెప్పు ఎత్తలేదని ప్రమాణం చేసి చెప్పగలరా. నాపై ఎమ్మెల్యే చెప్పు ఎత్తిన దానికి ఎంపీనే సాక్ష్యం’’ అని తెలిపారు. సీఎం జగన్ రెడ్డి వినుకొండ నియోజకవర్గంలో బొల్లా అరాచకాలపై దృష్టి సారించాలని రైతు నరేంద్ర కోరారు. 


Updated Date - 2022-01-19T17:09:24+05:30 IST