Oct 24 2021 @ 04:06AM

అన్ని రకాల షేడ్స్‌ ఉన్న సినిమా

సీనియర్‌ హీరో వినోద్‌కుమార్‌, తాన్యాదేశాయ్‌, అంకిత్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘స్ట్రీట్‌లైట్‌’. విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్‌ నిర్మించారు. నవంబర్‌ 12న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఒకరాత్రి స్ట్రీట్‌లైట్‌ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  అన్ని రకాల షేడ్స్‌ ఉన్న సినిమా ఇది. ఓటీటీ ఆఫర్‌ వచ్చినా, థియేటర్లలోనే సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘రివెంజ్‌ డ్రామా కథాంశంతో విభిన్నంగా ఈ సినిమాను రూపొందించాం.  ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి విరించి సంగీతం అందించారు.