Abn logo
Sep 17 2021 @ 23:15PM

రేపు వినాయక నిమజ్జనం : వీహెచ్‌పీ

మాట్లాడుతున్న మద్ది యాదిరెడ్డి

మహబూబ్‌నగర్‌ పద్మావతి కాలనీ, సెప్టెంబరు 17 : మహబూబ్‌నగర్‌ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవా లలో భాగంగా ఈ నెల 19న వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉత్సవ కమిటీ కార్యాలయంలో కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేదపండితుల సూచనల మేరకు ఈ నెల 19న వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా జరుపు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య, రాజేందర్‌, శంకర్‌, అంజయ్య, లక్ష్మీనారా యణ పాల్గొన్నారు.