విజయనగరం: ఏపీ ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ అశోక్‌గజపతిరాజు సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియతో మాట్లాడుతూ కరోనా ఆంక్షలు అన్నింటికీ ఒకే విధంగా ఉండాలని, ఏ పండగకు లేని ఆంక్షలు వినాయక చవితికే ఎందుకు? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను గౌరవించాలన్నారు. అందరినీ సమానంగా చూడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. దొంగలను ఎక్కడ ఉంచాలో.. అక్కడ ఉంచనందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకత లేకుండా పోయిందని తప్పుబట్టారు. ప్రభుత్వ జీవోలను కూడా ప్రజలకు అందుబాటులో పెట్టడం లేదని అశోక్‌గజపతి దుయ్యబట్టారు.