యూఎస్‌టీడీఏ సీఓఓగా వినయ్‌ తుమ్మలపల్లి

ABN , First Publish Date - 2021-10-19T08:04:03+05:30 IST

అమెరికాలో మరో తెలుగు బిడ్డకు అత్యున్నత పదవి లభించింది. ప్రవాస భారతీయుడు వినయ్‌ తుమ్మలపల్లి (66)ని ప్రభుత్వ నిర్వహణలోని అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎ్‌సటీడీఏ) డిప్యూటీ డైరెక్టర్‌, ప్రధాన నిర్వహణ అధికారి (సీఓఓ)గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. విదేశాలతో అమెరికా వాణిజ్య అభివృద్దిలో యూఎ్‌సటీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది.

యూఎస్‌టీడీఏ సీఓఓగా వినయ్‌ తుమ్మలపల్లి

వాషింగ్టన్‌: అమెరికాలో మరో తెలుగు బిడ్డకు అత్యున్నత పదవి లభించింది. ప్రవాస భారతీయుడు వినయ్‌ తుమ్మలపల్లి (66)ని ప్రభుత్వ నిర్వహణలోని అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎ్‌సటీడీఏ) డిప్యూటీ డైరెక్టర్‌, ప్రధాన నిర్వహణ అధికారి (సీఓఓ)గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. విదేశాలతో అమెరికా వాణిజ్య అభివృద్దిలో యూఎ్‌సటీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వినయ్‌ 1974లో అమెరికా వచ్చారు. వినయ్‌ తండ్రి టీ ధర్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా పని చేశారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసేటప్పుడు వినయ్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు రూమ్మేట్‌గా ఉన్నారు.  ఒబామా తన హయాంలో వినయ్‌ను సెంట్రల్‌ అమెరికా దేశమైన బెలిజికి అమెరికా రాయబారిగా నియమించారు. ప్రైవేటు రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న వినయ్‌ వృత్తిరీత్యా మెకానికల్‌ ఇంజనీర్‌. అమెరికాలోని కొలరాడోలో ఆయనకు రికార్డబుల్‌ సీడీ-ఆర్‌, డీవీడీ-ఆర్‌ ఆప్టికల్‌ డిస్కుల తయారీ యూనిట్‌ కూడా ఉంది.

Updated Date - 2021-10-19T08:04:03+05:30 IST