విమ్స్‌లో చావు కేకలు

ABN , First Publish Date - 2020-08-03T13:31:04+05:30 IST

రాష్ట్రస్థాయి ప్రాంతీయ కొవిడ్‌ ఆస్పత్రి విమ్స్‌ (విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో..

విమ్స్‌లో చావు కేకలు

ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుల గోడు

మందులు ఇవ్వడం తప్ప వైద్యం చేయడంలేదని ఆవేదన

ప్రాణాలతో ఇంటికెళతామో లేదోనని బెంగ  

బెడ్‌షీట్‌ కూడా ఇవ్వడం లేదు!

కరోనా కన్నా... ఆస్పత్రిలోని పరిస్థితుల వల్లే చనిపోతున్నారు

సోషల్‌ మీడియాలో వీడియోను పోస్టు చేసిన యువకుడు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ప్రాంతీయ కొవిడ్‌ ఆస్పత్రి విమ్స్‌ (విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో పరిస్థితులు అధ్వానంగా వున్నాయి. ‘‘మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేశారు. ఎవరూ పట్టిం చుకోవడంలేదు’’ అంటూ బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమ్స్‌లో పరిస్థితులపై మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ జిల్లా అధికార యం త్రాంగం అంతగా స్పందించడంలేదన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ బారినపడి, విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి అరిచి.. అరిచి... కిందపడి చనిపోయాడంటూ మరో బాధితుడు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో ఒకటి విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ వీడియోలో యువకుడు పేర్కొన్న అంశాలను బట్టి చూస్తే విమ్స్‌లో పరిస్థితి ఆందోళనకరంగా వుందనిపిస్తున్నది. బాధితులను పట్టించుకునే వారు లేకపోవడంతో ఆరోగ్యపరంగా, మానసి కంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు ఎవరూ రావడం లేదని, రోజులో ఒకటి, రెండుసార్లు మందు బిళ్లలు ఇస్తున్నారు తప్ప తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరూ అడగడంలేదని బాధితులు వాపోతున్నారు. కరోనాబారిన పడ్డామన్న భయంకన్నా.... విమ్స్‌లో పరిస్థితులే ఎక్కువ భయాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతిని ధులు సత్వరమే స్పందించి, విమ్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు

వీడియోలో ఏముందంటే...

‘‘నేను విమ్స్‌ ఆస్పత్రిలో ఉన్నా... రాత్రి ఒక కరోనా రోగి అరిచి.. అరిచి కింద పడి చనిపోయాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎంత అరి చి గీచి పెట్టినా ఎవరు రావడం లేదు. ఒక బెడ్‌ మీద నుంచి వృద్ధు రాలు కిందపోయినా ఎవరూ పట్టిం చుకోలేదు. వార్డులో డాక్టరుగానీ, నర్సుగానీ ఉండడంలేదు. ఎవరూ పట్టించుకో నప్పుడు కరోనా బాధితులను ఇక్కడకు ఎందుకు తీసుకురావాలి? ఎవరి ఇళ్లల్లో వారిని వుంచేస్తే సరిపోయేది కదా. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయమేస్తున్నది. నాకు పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళతానో లేదో, పిల్లలను చూ స్తానా లేదో అన్న బెంగ పట్టుకుంది. చనిపోయిన వ్యక్తి బెడ్‌ను శానిటైజ్‌ చేయకుండానే మరో బాధితునికి దానిని కేటాయిస్తున్నారు. బెడ్‌ షీట్‌ కూడా ఇవ్వడం లేదు. వాష్‌రూమ్‌లో పరిస్థితి ఘోరంగా వుంది. కరోనా వచ్చినా భయపడాల్సిన పని లేదని సీఎం జగన్మోహన్‌రెడ్డి చెబుతు న్నారు. కానీ కరోనా వచ్చిందన్న భయం కంటే.. ఇక్కడి ఆస్పత్రిలో వున్న వాతావరణాన్ని చూసి చాలా మంది ఆందోళనతో చనిపోతు న్నారు’’ అంటూ ఆ యువకుడు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు.


Updated Date - 2020-08-03T13:31:04+05:30 IST