హాట్ పిక్స్‌తో టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ

2005లో విడుదలైన 'పోయ్ అనే తమిళ చిత్రంతో వెండితెరకి పరిచయమైన హీరోయిన్ విమలా రామన్. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. అందాలను ఆరబోయడానికి పెద్దగా హద్దులు పెట్టుకోలేదు. దీనితో కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈమె మంచి అవకాశాలను దక్కించుకుంది. ఇక వరుణ్ సందేశ్ సరసన నటించిన  'ఎవరైనా ఎపుడైనా' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది విమల. అయితే తరువాత కాలంలో తెలుగునాట విజయాలను అందుకోలేకపోయిన ఈ హీరోయిన్..  మళయాల సినిమాలకే పరిమితమైంది. ప్రస్తుతం వెబ్ సీరీస్‌లలో నటిస్తోన్న విమలా రామన్.. తాజాగా అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార పోకడలపై తన నిరసనని విన్నూత్నంగా తెలియచేసింది. 


విమలా రామన్ చేతిలో ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ ఏమి లేవు. దీంతో సోషల్ మీడియాలో విమలా యమా యాక్టీవ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ ఏజ్డ్  బ్యూటీ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఇలానే స్కిన్ షో చేసి వార్తల్లో నిలిచింది విమల. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార కార్యక్రమాలకు వ్యతిరేకంగా.., ఈ హాట్ హీరోయిన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ షూట్‌లో..  బ్లాక్ సూట్ వేసుకున్న సీనియర్ బ్యూటీ ..టాప్ బటన్స్ పెట్టకుండా కెమెరా ముందు బోల్డ్‌గా ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ  హీరోయిన్ అందాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోన్నాయి. ఆస్ట్రేలియాకి చెందిన ఇండియన్ ఫోటో గ్రాఫర్ రాజ్‌సూరి ఈ ఫోటో షూట్ చేయడం విశేషం. మరి.. స్కిన్ షోతో అదరకొడుతోన్న ఈ హాట్ యాక్ట్రెస్ రానున్న కాలంలో ఎలాంటి అవకాశాలను దక్కించుకుంటుందో చూడాలి. 

Advertisement