అంధకారంలో గ్రామాలు

ABN , First Publish Date - 2020-11-28T06:23:55+05:30 IST

రెండు రోజులు గా తుపాను జిల్లాను అతలాకుతలం చేస్తోంది. నివర్‌ త్రీవతతో కురిసిన భారీవర్షాలతో పాటు వీచిన గాలులకు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

అంధకారంలో గ్రామాలు
వరద నీటిలో కొప్పోలు సబ్‌స్టేషన్‌

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

తెగిపడిన తీగలు.. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు

రూ.89.52లక్షల ఆస్తినష్టం 



ఒంగోలు(క్రైం), నవంబరు 27: రెండు రోజులు గా తుపాను జిల్లాను అతలాకుతలం చేస్తోంది. నివర్‌ త్రీవతతో కురిసిన భారీవర్షాలతో పాటు వీచిన గాలులకు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. స్తంభాలు విరిగిపోయి. తీగలు తెగి కరెంటు స రఫరాకు తీవ్ర ఆటకం కలిగింది. జిల్లావ్యాప్తంగా విద్యుత్‌శాఖకు సుమారుగా రూ.89.52లక్షల  వ రకు ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథ మిక అంచనాకు వచ్చారు. జిల్లాలో 32 మండలా ల్లో 262 గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచి పో గా శుక్రవారం సాయంత్రానికి 234 గ్రామాల్లో వి ద్యుత్‌ను పునరుద్ధరించారు ఇంకా 28 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. 33కేవీ లైన్లు 33, 11కేవీ లైన్లు 347 తెగిపోయాయి. 11 కేవీ సబ్‌స్టేషన్లు 113, 33 కేవీ సబ్‌స్టేషన్లు 14 దెబ్బతిన్నాయి. సూ మారుగా 300కు పైగా స్తంభాలు విరిగిపో యాయి. ఒంగోలు డివిజన్‌లో 13 సబ్‌స్టేషన్‌లలో గల 93 గ్రామాలకు కరెంటు సరఫరాలో అంతరా యం ఏర్పడింది. 37 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా, 157 స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో సుమా రుగా రూ.40లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. శుక్రవారం రాత్రికి 83 గ్రామాల్లో కరెం టు సరఫరాను సరి చేశారు. ఇంకా రాత్రి పొద్దు పోయేవరకు సిబ్బంది క్షేత్రస్థారులోఓ పనిచేస్తూ ఉన్నారు. ఎక్కువగా తీర ప్రాంత గ్రామాల్లో తు పాను ప్రభావం ఉండగా యుద్దప్రాతిపాదికన మరమ్మతులు చేయిస్తున్నట్లు ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. కందుకూరు, చీరాల, ఒంగోలు డి విజన్‌లలో అధికంగా విద్యుత్‌ సరఫరాకు అటకం కలిగింది. అదేసమయంలో నష్టం కూడా ఎక్కువ గా ఉంది.


 

Updated Date - 2020-11-28T06:23:55+05:30 IST