మర్రిపూడిలో మంటలు!

ABN , First Publish Date - 2022-08-19T06:32:45+05:30 IST

బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీ వద్దంటూ పోరుబాట ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేశాయి.. హైకో ర్టు రైట్‌ రైట్‌ అంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది.. అయితే ఆరు గ్రామాల ప్రజలు మాత్రం వ్యతి రేకిస్తున్నారు.

మర్రిపూడిలో మంటలు!
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో సోమవారం ఫ్యాక్టరీ వద్దకు వెళ్లే రోడ్డును తవ్వేస్తున్న గ్రామస్థులు

బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీ వద్దంటూ పోరుబాట

ఒక్కటైన ఆరు గ్రామాల ప్రజలు

ఆందోళనలో 30 వేల మంది 

90 రోజులుగా రిలే నిరాహార దీక్షలు

అయినా ఆగని ఫ్యాక్టరీ నిర్మాణ పనులు

రోడ్డును తవ్వేసి నిరసన

ఎలాగైనా అడ్డుకుంటామని ప్రతిన

ఎన్జీటీని ఆశ్రయించిన బాధితులు 

26వ తేదీ వరకూ వాయిదా

ఆ తరువాత తేలుస్తానని కలెక్టర్‌ హామీ

మద్దతుగా నిలిచిన నేతలు

హోం మంత్రి స్పందించాలని డిమాండ్‌


ప్రముఖ తమిళనటుడు సూర్య నటించిన సింగం-3 సినిమా చాలా మంది చూసే ఉంటారు.. చైనా ఆసుపత్రుల్లోని బయోమెడికల్‌ వేస్ట్‌ను కంటైనర్ల ద్వారా కర్ణాటక ప్రాంతానికి తరలించి.. బర్న్‌ చేస్తారు. దీని వల్ల వచ్చే  పొగ ప్రభావంతో విద్యార్థులతో పాటు పలువురు మృతిచెందుతారు. ఈ పరిశ్రమ వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంటుంది. ఈ పరిశ్రమ మూత వేయించడం కోసం హీరో పోరాటం చేస్తాడు. అటువంటి పోరాటమే రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో జరుగుతోంది. ఇక్కడ హీరో ఒక్కరూ ఇద్దరూ కాదు.సుమారు ఆరు గ్రామాలకు   చెందిన 30 వేల మంది ప్రజలు. 


 (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

 ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేశాయి.. హైకో ర్టు రైట్‌ రైట్‌ అంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది.. అయితే ఆరు గ్రామాల ప్రజలు మాత్రం వ్యతి రేకిస్తున్నారు. ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదంటూ అడ్డుపడు తున్నారు.. సుమారు 90 రోజులుగా ప్రతి రోజూ నిరసన దీక్షలు చేస్తున్నారు.నాయకులు వస్తున్నారు..వెళుతున్నారు తప్ప ప్రయోజనం లేదు. తాజాగా గురువారం రాజమ హేం ద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద కలెక్టర్‌ ఉన్నా రని తెలుసుకుని ముట్టడించారు. సమస్య పరిష్క రిం చాలని నినాదాలతో హోరెత్తించారు.. కలెక్టర్‌ సమస్య పరిష్కారానికి 26వ తేదీ తరువాత చర్యలు తీసు కుంటానని హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు. 


2016 నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు యత్నం..


రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలోని  పచ్చని పొలాల్లోని 228వ సర్వే నెంబర్‌లోని 1.28 ఎకరాల భూమిలో బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు 2016 నుంచి ఒక పారిశ్రామికవేత్త ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటి నుంచి అనుమతులు రావడం ఆలస్యమైంది. ఇటీవల అన్ని రకాలు అనుమతులు పొంది పరిశ్రమకు అంకుర్పారణ చేశాడు.ఈ పరిశ్రమలో ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో ఉపయోగించి పడేసిన వ్యర్థాలు,ఆపరేషన్లు చేసిన మానవ అవయవాలు, ఇతర వ్యర్థాలు అన్ని తెస్తారు. ఇక్కడ మండించి భూగర్భంలోకి పంపు చేస్తారట.. సూది నుంచి అన్ని రకాల వ్యర్థాలు ఇక్కడకు వస్తాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


ఆరు గ్రామాల ప్రజల అడ్డగింత..


ఇటీవల సదరు ఫ్యాక్టరీ యజమాని పర్యావరణ  అను మతులు తెచ్చుకుని  పనులు ప్రారంభించారు. హైకోర్టు నుంచి ఆర్డర్‌ తీసుకుని పోలీసుల సహాయంతో పనులు చేయిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేయడంతో  మర్రిపూడి గ్రామంతో పాటు పెద్దాపురం మండలంలోని చిన బ్రహ్మదేవం,ఆర్వీ పట్నం, కొండపల్లి, సామర్లకోట మండలంలోని జి.కొత్తూరు గ్రామ ప్రజలు మర్రిపూడి కేంద్రంలో ఆందోళనకు దిగారు. అక్కడ ప్రారంభించిన పనిని ధ్వంసం చేయడంతో పాటు.. ఏ వాహనం వెళ్లకుండా రోడ్డును తవ్వేశారు. అక్కడ పనికి వచ్చేవారికి మంచినీళ్లు అందకుండా సహాయ నిరాకరణ చేశారు. ఒక్కటై పోరాటం చేస్తున్నారు.


ఇందుకే వ్యతిరేకించేది..


ఈ పరిశ్రమ వల్ల చాలా అనర్థాలు  ఉన్నాయని ఆరు గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈ వ్యర్థాల వల్ల అం టువ్యాధుల వంటి ప్రభావాలు ఉంటాయి. తమ పచ్చని పొలాలు నాశనమైపోతాయని.. భూగర్బజలాలు కలుషితం అవుతాయని.. చేపల చెరువులపై తీవ్ర ప్రభా వం పడుతుందని.. పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని వాదిస్తూ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా రు. దీనిలో భాగంగా మర్రిపూడి గ్రామంలో సుమారు 3 నెలల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ప్రతి రోజూ నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ పరిశ్రమ వద్దంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యు నల్‌ (ఎన్జీటీ)లో కేసు వేశారు. ఇదిలా ఉండగా గురువా రం సుమారు 1500 మంది రాజమహేంద్రవరాన్ని ముట్ట డించారు. ఫ్యాక్టరీ నిర్మాణం నిలుపుదల చేయాలని డి మాండ్‌ చేశారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద సుమా రు గంట సేపు ఆందోళన చేయడంతో కలెక్టర్‌ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్జీటీలో ఈ నెల 26న తీర్పు రానున్న నేపథ్యంలో అప్పటి వరకూ  పనులు ఆపినట్టు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.


 పల్లకడియంలో మొదటి పరిశ్రమ


  వాస్తవానికి రాజానగరం మండలం పల్లంకడియంలో 2002లో ఇటువంటి పరిశ్రమ పెట్టారు. మూడు నెలల కిందట ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆపేశారు. కానీ మళ్లీ కొందరి పెద్దల జోక్యంతో పరిశ్రమ నడుస్తోంది. ఇక్కడకు పాత ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ఆసుపత్రుల నుంచి వ్యర్థాలు వస్తాయి. దీని వల్ల పొగ ఎక్కువగా వస్తుందని, మానవ వ్యర్థాలు, మెడికల్‌ వ్య ర్థా లను ఇక్కడ మండించడం వల్ల భరించలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. వాస్తవానికి ఇక్కడ బూడిదను విశాఖలోని ఓ ప్రాంతానికి తరలించాలి.రవాణా ఖర్చులు కలిసి వస్తాయని ఆ బూడిద కూడా ఇక్కడే పడేయం వల్ల పెద్దసమస్యగా మారిందని ప్రజలు వాపోతున్నారు.


ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకోం..

గ్రామంలో బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పా టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం..ఆ ఫ్యాక్టరీ ఏర్పాటును ఎలాగైనా అడ్డుకుంటాం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమను పచ్చని పంట పొలాలు.. మర్రిపూడి ఊరుకు దగ్గరగా  ఏర్పాటు చేయాలనుకోవడం తగదు. 

- చిరంజీవి, మర్రిపూడి సర్పంచ్‌ భర్త


ప్రభుత్వం పట్టించుకోవాలి..

ఆరు గ్రామాల ప్రజలు వద్దంటున్నా ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం దారుణం.. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.  ఫ్యాక్టరీ నిర్మాణానికి పోలీసులు సహకరిం చడం దారుణం.ప్రజల శాంతిభద్ర తలు కాపాడడానికి ఉన్న పోలీ సులు. అశాంతికి నిలయమైన ఫ్యాక్టరీ పనులకు ఎలా అండగా నిలబడతారు. దీనిపై హోం మంత్రి వనిత తక్షణం స్పందించాలి.  -  వెంకటేశ్వరరావు


Updated Date - 2022-08-19T06:32:45+05:30 IST