ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2020-08-10T10:15:41+05:30 IST

మండలంలోని పల్లెలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ సూచించారు

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

మందమర్రిరూరల్‌, ఆగస్టు 9: మండలంలోని పల్లెలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. మంద మర్రి మండలంలోని అందుగులపేట గ్రామపంచాయతీలో ఆదివారం గం దగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా  ప్రజలకు ప్లాస్టిక్‌ వాడవద్దని  అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను పంచాయతీ సిబ్బంది చేత తీయించారు. సర్పంచ్‌ ఏనుగు తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ లౌడం రాజ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి నరేష్‌  పాల్గొన్నారు. సారంగపల్లిలో గందగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమాన్ని సర్పంచు ఫర్హీనాసుల్తానా ఆధ్వర్యంలో నిర్వహించారు. 


హాజీపూర్‌: హాజీపూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదవారం గంధగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య సిబ్బంది గ్రామా లల్లో ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, కోఆప్షన్‌ సభ్యులు, కారోబార్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.  ప్లాస్టిక్‌ బ్యాగులను వాడుతున్న గు డిపేటలోని ఓ హోటల్‌ యజమానికి ఆదివారం రూ.500 జరిమానా విధిం చారు. మురికి రహిత కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ లగిశెట్టి లక్ష్మి రాజ య్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం కార్యదర్శి, పంచాయతీ సిబ్బందితో కలిసి పర్యటించారు. ఉపసర్పంచ్‌ విష్ణువర్దన్‌, వార్డు సభ్యులు, గ్రామస్థులు  తదితరులు పాల్గొన్నారు. 


భీమిని: గ్రామంలోని ప్లాస్టిక్‌ను వాడవద్దని సర్పంచు ఇందూరి భూ మయ్య పేర్కొన్నారు. గందగి ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆది వారం మండలంలోని చిన్న తిమ్మాపూర్‌ గ్రామంలో మల్టీ పర్పస్‌ వర్కర్లతో ప్లాస్టిక్‌ వ్య ర్ధాలను తీసివేయించారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.  


జైపూర్‌: మండలంలోని రామారావుపేట, ఇందారం, పౌనూర్‌, శివ్వారం గ్రామాల్లో గందగీ ముక్త్‌ భారత్‌ కా ర్యక్రమంలో భాగంగా స ర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రతీ గ్రామాంలో ప్లాస్టిక్‌ బాటిల్స్‌, కవర్స్‌ను సేక రించి డంపింగ్‌ యార్డ్‌లో వేశారు.కార్యక్రమంలో సర్పంచ్‌లు, కార్యదర్శు లు, పాల్గొన్నారు. 


కాసిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గందగీ ముక్త్‌ భారత్‌ కా ర్యక్రమాన్ని కోమటిచేనులో ఆదివారం ఎంపీపీ రొడ్డ లక్ష్మి ప్రారంభిం చారు. గ్రామంలోని ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించి పడేశారు. కార్యక్రమం లో ఎంపీడీవో ఆలీం, సర్పంచ్‌ రాంటెంకి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ ప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వాసుదేవ్‌, ఎంపీటీసీ చంద్రమౌళి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


భీమారం: మండలంలో గందగీ ముక్త్‌ భారత్‌ను విజయవంతం చేయాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం భీమారం మం డలంలోని భీమారం, దాంపూర్‌, పోలంపల్లి గ్రామాల్లో కార్యక్రమాన్ని ని ర్వహించారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను పంచాయతీ సిబ్బంది సేకరించారు. జ డ్పీటీసీ భుక్య తిరుమల, వైస్‌ ఎంపీపీ సమ్మయ్య,  సర్పంచులు గద్దె రాం రెడ్డి, దర్శనాల రమేష్‌, సంతోషం భాస్కర్‌రెడ్డి, ఎంపీవో శ్రీపతి బాపురావు, నాయకులు రవి, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌, తిరుపతి  పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-10T10:15:41+05:30 IST