గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2020-07-10T10:53:04+05:30 IST

ప్రస్తుతం కరోనా మహ మ్మారిలా విస్తరిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు 


హాజీపూర్‌, జూలై 9: ప్రస్తుతం కరోనా మహ మ్మారిలా విస్తరిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. గురువారం పలు గ్రామాల్లో కంపోజ్‌ షెడ్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్లాస్టిక్‌ నిషేధించాలని, ఊర్లో ఉన్న చెత్తను రోజు సేకరించి, తడిపొడి చెత్తగా వేరు చేసి కంపోజ్డ్‌ షెడ్లలో వేయాలన్నారు.


సీఎం కేసీఆర్‌ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని, పల్లెల్లో కంపోజ్డ్‌షెడ్లు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్‌, కార్యదర్శిపై ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శిల్ప శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు వెంకటేష్‌ రామారావు, జడ్పీ కోఆప్షన్‌ పాషా, జడ్పీ సీఈఓ నరేందర్‌, ఎంపీడీఓ ఎంఏ హై, ఏపీఓ మల్లయ్య, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:53:04+05:30 IST