పల్లెల్లో ఆశావహుల సందడి

ABN , First Publish Date - 2021-01-25T07:09:44+05:30 IST

ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడింది. ప్రభుత్వానికి భయపడిన అధికారులు పైకి పట్టనట్టు ఉన్న ప్పటికీ, సుప్రీం తీర్పు ఎలా ఉంటుందనే భయంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తు న్నారు.

పల్లెల్లో ఆశావహుల సందడి

సుప్రీం తీర్పుపై ఎడతెగని ఉత్కంఠ

ఇటు అభ్యర్థుల కోసం నేతల చర్చోపచర్చలు

విపక్షాలతోపాటు అధికార పక్షంలోనూ ప్రయత్నాలు

ఒక్కొ పార్టీ నుంచి సర్పంచ్‌ పదవులకు నలుగురేసి అభ్యర్థులు

ఇటు అధికారుల్లో గుంభనం.. చడీచప్పుడు లేకుండా ఏర్పాట్లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడింది. ప్రభుత్వానికి భయపడిన అధికారులు పైకి పట్టనట్టు ఉన్న ప్పటికీ, సుప్రీం తీర్పు ఎలా ఉంటుందనే భయంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తు న్నారు. ఇప్పటికే స్టేజ్‌ ఉన్న ఎన్నికల అధికారులకు ఆయా ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చినట్టు ఓ అధికారి చెప్పారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే అధికారులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. కోనసీమలో 273 గ్రామ పంచా యతీలకు మొదటి విడత ఎన్నికలు ప్రకటించడంతో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావలసి ఉంది. ఇక్కడే అధికారులు గుంభనంగా ఎవరిస్తున్నారు. ఎన్నికలు ఏర్పాట్లు అధికారికంగా చేస్తే ప్రభుత్వ ఆగ్రహానికి గురవ్వవలసి వస్తుందేమోననే భయం ఒకవైపు, సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహణకు అనుకూలంగా తీర్పు ఇస్తే మరో సమస్య అనే కారణంతో ఇప్పటికే ఓటర్ల జాబితాలు, నామినేషన్‌ పత్రాలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కానీ ఎక్కువమంది అధికార వర్గాల్లో కూడా ఎన్నికలు జరిగే అవ కాశం ఉన్నట్టే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆశావహులు సందడి చేస్తున్నారు.  ఎన్నికలు జరుగుతాయా, జరగవా అనేది విషయాన్ని పక్కన పెట్టి పోటీకి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. కోనసీమలో ఆదివారం నుంచి గ్రూపు మీటింగ్‌లు మొదల య్యాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటు న్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ఎన్నికలు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యమేమిటంటే,  ఎన్నికలను వ్యతిరేకిస్తున్న అధికార వైసీపీ నుంచి పోటీ చేయడానికి వైసీపీ నేతలు మంత నాలు చేయడం గమనార్హం. జిల్లాలో వివిధ దశల్లో ఎన్నికలు ప్రకటించినప్పటికీ,  ఇప్పటి నుంచే పోటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ వాదాలను ప్రజలు అంతంగా పట్టించుకోవడంలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది కదా, ఎన్నికలు జరిగిపోతాయనే ఆలోచనతో ఎక్కువమంది ఉన్నారు. ఓటర్లు ఎన్నికలు జరగాలనే కోరుతున్నారు. గ్రామాల్లో పెత్తనం కోసం అన్ని పార్టీ లకు చెందిన అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నలుగురు పేర్లు కూడా ముందుకు వస్తున్నాయి. ఈసారి జనరల్‌ స్థానాల్లో పోటీ చేయడానికి బీసీలు, ఎస్‌సీలు కూడా ఉత్సాహపడుతున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ రాజకీయాల మీదే ఆధారపడి ఉంటాయి. గతంలో డబ్బు, పలుకు బడి, కులం వంటి బలాలు చూపి ఎన్నికలు చేసేవారు. ఇవాళ అన్ని కులాలు చైతన్యం కావడంతో ఒక పార్టీ నుంచే ముగ్గురు నలుగురు పోటీకి సిద్ధమవుతు న్నారు. ఈ నేపఽథ్యంలో చాలాకాలం తర్వాత పంచాయతీ ఎన్నికలు సందడి నెల కొంది. సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికలకు అనుకూలంగా ఉంటే అధికారులు సిద్ధం కావలసిందే. ఇక రాజకీయ పార్టీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. వైసీపీ పైకి చెప్పకపోయినా, ఆశావహులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ, జనసేన కలసి పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. కాంగ్రెస్‌, వామపక్షాలూ పోటీకి సై అంటున్నాయి. దీంతో కొన్ని పార్టీల మధ్య గ్రామ స్థాయిలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.


Updated Date - 2021-01-25T07:09:44+05:30 IST