నిధులు నిల్‌..

ABN , First Publish Date - 2021-08-10T04:58:48+05:30 IST

గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. ఖాళీ ఖజానాతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఉసూరుమం టున్నారు.

నిధులు నిల్‌..

ఖాళీగా పంచాయతీల ఖజానా

జమకాని రిజిస్ర్టేషన్‌ సర్‌చార్జి బకాయిలు

విద్యుత్‌ బకాయిల కోసం రూ.125 కోట్ల చెల్లింపు 

పంచాయతీ తీర్మానం లేకుండానే నేరుగా ట్రాన్స్‌కోకు..

సీఎంఎఫ్‌ఎస్‌ నుంచీ నిధుల మళ్లింపు.. 

నిర్వీర్యంగా గ్రామ పంచాయతీలు 

సతమతమవుతున్న కొత్త సర్పంచ్‌లు  


గ్రామ పంచాయతీలను నిఽధుల కొరత వేధిస్తోంది. కొత్తగా గెలిచిన సర్పంచులు ఏ కార్యక్రమం చేపడదా మన్నా డబ్బుల్లేవ్‌.. అనే మాటే వినపడుతోంది. దాదాపు నాలుగేళ్ల నుంచి రిజిస్ర్టేషన్‌ కార్యాల యాల నుంచి రావలసిన సర్‌చార్జి బకాయిలు పంచాయతీ లకు జమ కాలే దు. గతంలో ఉన్న ప్రత్యేక అధికారులు వీటి గురించి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. దీంతో పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయి. మరోవైపు ఆర్థిక సం ఘం నుంచి వచ్చిన నిధులను ఎటువంటి తీర్మానాలు లేకుం డానే ప్రభుత్వం నేరుగా విద్యుత్‌ బకాయిలకు గాను రూ.125 కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిం చింది. దీంతో ఖాళీ ఖజానాతో సర్పంచులు సతమతమవుతున్నారు.


(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. ఖాళీ ఖజానాతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఉసూరుమం టున్నారు. తాజాగా జిల్లాకు రూ.350 కోట్ల ఆర్థిక సంఘ నిధులు విడుదలయ్యాయి. పంచాయతీల నుంచి మునిసిపాలిటీలుగా మారిన పిడుగురాళ్ళ, వినుకొండ, తాడేపల్లి, దాచేపల్లి, గురజాల, గుంటూరు పరిసర ప్రాంతాలు, రాజధాని అమరావతిలోని వివిధ పంచాయతీల్లో పెద్దమొత్తంలో విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. ఆర్థిక సంఘ నిధుల్లోంచి దాదాపు రూ.124 కోట్లు విద్యుత్‌ బకాయి లకు ప్రభుత్వం చెల్లించింది. ఈ చెల్లింపులపై గ్రామ పంచాయ తీలకు ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటివరకు పంచాయతీల్లో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తే కలెక్టర్లు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తూ వచ్చారు. పాత బకాయిలను దశలవారీగా చెల్లించేలా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధులు చర్చించేవారు. పంచాయతీల నిధులు ఖర్చు చే యాలంటే పాలకవర్గ తీర్మానం వుండాలి. అటువంటిదేమీ లేకుం డా.. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర  ప్రభుత్వం ఆర్థికశాఖద్వారా నేరుగా ట్రాన్స్‌కోకు జమ చే యించారు. 


పంచాయతీలకు మొండిచేయి..

గ్రామపంచాయతీలకు ఇటీవల కొత్తపాలక వర్గాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతో ఇతర వనరుల ను అనుసంధానం చేసి సర్పంచ్‌లు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రతి పంచాయతీకి ఆర్థిక సంఘ నిధులు జనాభా ఆధారంగా వస్తుంటాయి. ఆర్థిక సంఘం ద్వారా ఎంత నిధులు వస్తాయో సర్పంచ్‌, కార్యదర్శి ఇతర అధికారులకు అవగాహన వుం టుంది. దానికి అనుగుణంగా లక్ష్యాలను ఖరారు చేస్తుంటారు. ఎటువంటి సమాచారం లేకుండా గత నెల 15న ప్రభుత్వం జీవో నెంబ రు 90ని విద్యుత్‌బిల్లుల బకాయిలకు ఆర్థిక సంఘం సొమ్ములను జమచేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొత్తసర్పంచ్‌లు కంగుతిన్నారు.  


జమ కాని రిజిస్ర్టేషన్‌ సర్‌ చార్జీలు

జిల్లాలో నాలుగేళ్ల నుంచి పంచాయతీకు రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జి నిధులు జమకావటం లేదు. ఏటా జిల్లా లోని 1,042 గ్రామ పంచాయతీలకు సుమారు రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లవరకు సర్‌ చార్జి నిధులు సబ్‌రిజిస్టార్‌ కార్యాలయాల నుంచి జమ అవుతుంటాయి. 2017-18 నుంచి సుమారు రూ.500 కోట్లవరకు  నిధులు జమ కావాల్సి వుంది. నిధులు రాక పోవటంతో  జనరల్‌ ఫండ్‌ తగ్గిపోయింది.  2018 ఆగస్టు నుంచి మొన్నటివరకు ప్రత్యే కాధికారుల పాలనలో ఉన్నాయి. వీరు రిజి స్ట్రేషన్‌ సర్‌ఛార్జి నిధులను జమచేయించటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందు బాటులో ఉన్న నిధులతో ప్రణాళికలు రూపొందించి కాలం వెళ్ళబుచ్చారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత ్తసర్పంచ్‌లు గ్రామాలలో ఏపని చేయాలన్నా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 


సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి జమ కావటం లేదు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో గ్రామ పంచాయతీలకు సీఎం ఎఫ్‌ ఎస్‌ నుంచి నిఽధలు ఇస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిద సంక్షేమ పథకాలకు నిధు ల కొరత కారణంగా సీఎంఎఫ్‌ఎస్‌లో నిల్వవున్న నగదును దారి మళ్ళిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సర్పంచ్‌లకు ఇంకా చెక్‌పవర్‌ రాకపోవ టంతో పాతబిల్లులను క్లియర్‌ చేయ లేక పోతున్నారు. 


తీర్మానం లేకుండా ఇవ్వకూడదు..

పంచాయతీల నిధులు ఖర్చు చేయాలంటే పాలక వర్గ తీర్మానం ఉండాలి. పంచాయతీలకు అధికారా లు, నిధులు, విధులు ఇవ్వ కపోగా ఉన్నవాటిని లాగే స్తున్నారు. విద్యుత్‌ బకా యిలు దీర్ఘకాలంగా ఎందు కు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించాలి. వాటిని జమ చేయటానికి వాయిదా పద్ధతుల్లో అవకాశం ఇవ్వాలి. ఇందుకు విరుద్ధంగా ఆర్థిసంఘ నిధులు జమచేసుకోవటం చట్టవిరుద్దం.

  - జాస్తి వీరాంజనేయులు, ఏపీ పంచాయతీ పరిషత్‌ చైర్మన్‌  


రాజధాని ప్రాంతంలో అయోమయం.. 

రాజధాని అమరావతి పరిధిలో 29 గ్రామాలున్నా యి. మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లో పంచాయతీ ఎన్ని కలు జరగలేదు. ఈ ప్రాంతంలో రాజధాని వలన రిజిస్ట్రేషన్‌లు పెరిగాయి. ఆ డబ్బును పంచాయతీలకు జమచేయలేదు. ఇక్క డ సుమారు రూ.500 కోట్ల వరకు రిజిస్ట్రేషన్‌ సర్‌ఛార్జ్‌ నిధులు జమ కావాల్సి వుంది. ప్రభుత్వం ఈ నిధులను పంచా యతీలకు జమచేయకుండా దారి మళ్ళించింది. 

- మల్లెల హరేంద్రనాథ్‌చౌదరి,  తుళ్ళూరు మాజీ ఎంపీపీ    


 

Updated Date - 2021-08-10T04:58:48+05:30 IST