‘పల్లెలకు సాంకేతికత చేరువు కావాలి’

ABN , First Publish Date - 2021-03-07T06:45:07+05:30 IST

నూతన సాంకేతిక విధానాలు ప్రతి గ్రామానికి చేరువై తద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేయాలని జోన్‌-10 భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంచాలకులు డాక్టర్‌ జె.వి.ప్రసాద్‌ అన్నారు.

‘పల్లెలకు సాంకేతికత చేరువు కావాలి’
సమావేశంలో మాట్లాడుతున్న భరతలక్ష్మి


రాంబిల్లి, మార్చి 6 : నూతన సాంకేతిక విధానాలు ప్రతి గ్రామానికి చేరువై తద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేయాలని జోన్‌-10 భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంచాలకులు డాక్టర్‌ జె.వి.ప్రసాద్‌ అన్నారు. హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం శాస్త్రీయ సలహా సంఘం సమావేశం ఏర్పాటైన సందర్భంగా తొలుత ఆయన వీడియో ద్వారా ప్రసంగాన్ని వినిపించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో మరింత నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు ఎం.భరతలక్ష్మి మాట్లాడుతూ చెరకులో విలువ ఆధారిత ఉత్పత్తులు పెంచడం వల్ల రైతులకు ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందన్నారు.  బీసీటీ కేవీకే చైర్మన్‌ బి.శ్రీరామ్మూర్తి, కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజా కుర్రా, వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్‌ టి.గోపీకృష్ణ, కొక్కిరాపల్లి నువ్వుల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ తులసీ లక్ష్మి, శిరీష, నాబార్డు ఏజీఎం శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖాధికారులు టి.దాసు, జి.పద్మజ, ఉద్యాన శాఖ ఏడీఏ అనూరాధ, పశు వైద్య విభాగం డీడీలు కరుణాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T06:45:07+05:30 IST