కరోనా టెస్టులు చేయాలని గ్రామస్తుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-17T00:08:40+05:30 IST

ఆకివీడు మండలం దుంపగడపలో కంటోన్మెంట్ జోన్లో ఉన్న తమకు కరోనా టెస్ట్ చేయాలంటూ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో రేషన్ డీలర్ కరోనాతో మృతి చెందాడని

కరోనా టెస్టులు చేయాలని గ్రామస్తుల ఆందోళన

ఏలూరు: ఆకివీడు మండలం దుంపగడపలో కంటోన్మెంట్ జోన్లో ఉన్న తమకు కరోనా టెస్ట్ చేయాలంటూ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో రేషన్ డీలర్ కరోనాతో మృతి చెందాడని, అతని అల్లుడికి ప్రైమరీ కాంటాక్ట్‌లో కరోనా సోకిందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ రోగులకు టెస్ట్‌లు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాధి ముదిరి ఏ కారణంతోనైనా చనిపోతే అప్పుడు కరోనా టెస్ట్‌లు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏలూరు ఆసుపత్రిలో రోగి దురదృష్టవశాత్తు మరణిస్తే మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లనీయడం లేదు. కరోనా టెస్ట్‌ చేయాలంటూ మార్చురీకి తరలిస్తున్నారు. ఆ టెస్టు చేయడానికి నమూనా తీయడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. తర్వాత ఫలితం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకూ ఆ మృతదేహాలు మార్చురీలోనే పడవేసి ఉంచుతున్నారు.

Updated Date - 2020-07-17T00:08:40+05:30 IST