Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువకుడి శవాన్ని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసిన గ్రామస్థులు.. 150 మందిపై కేసు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఒక యువకుడి మృతదేహం కాళ్లకు తాడు కట్టి, చెట్టుకు వేలాడదీశారా గ్రామస్థులు. అలా కట్టేసి ఆ మృతదేహాన్ని ఊపుతూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమవడంతో.. పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇలా శవాన్ని తలకిందులుగా వేలాడదీసిన ప్రాంతంలో స్థానిక పోలీసు అధికారులు కూడా కనిపించడం గమనార్హం. ఈ క్రమంలో వీడియోలో 100 నుంచి 150 మంది వరకూ ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వీరందరిపైనా కేసులు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసింది. గునా ప్రాంతానికి చెందిన భన్వర్‌లాల్ బంజారా అనే యువకుడు.. జోగీపురా గ్రామంలోని స్టెప్ డ్యాంలో మునిగి మరణించాడు. అతని మృతి గురించి తెలుసుకున్న గ్రామస్థులు.. హడావుడిగా అతని మృతదేహాన్ని నీటి నుంచి తొలగించి, బయటకు తీశారు.


ఆపై శరీరంలోని నీరు బయటకు వచ్చేస్తే భన్వర్‌లాల్ ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని వాళ్లు భావించారు. ఈ ఆలోచనతోనే అతని మఋతదేహం కాళ్లకు తాడు బిగించి, ఒక చెట్టుకు వేలాడదీశారు. శరీరంలోని నీరు బయటకు వచ్చేయడానికి అలా మృతదేహాన్ని ఊపుతూ నిలబడ్డారు. ఆ సయమంలో గుంపుగా నిలబడిన గ్రామస్థులంతా.. కనీసం మాస్కులు కూడా ధరించలేదు. ఇక సామాజిక దూరం మాటే లేదు. ఒకరి మీద ఒకరు పడుతూ గోల గోల చేశారు. ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఆ వీడియోలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు కూడా కనపడటంతో ఉన్నతాధికారులకు కోపం వచ్చింది. గ్రామానికి చెందిన 150 మందిపైనా కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement