Abn logo
Sep 29 2021 @ 07:56AM

Tamil Nadu: మహిళలను లైంగికంగా వేధించిన ముగ్గురు ఈవ్‌టీజర్లను గ్రామస్థులు ఏం చేశారంటే...

కృష్ణగిరి (తమిళనాడు): మహిళలను వేధించిన ముగ్గురు ఈవ్ టీజర్లకు గ్రామస్థులు బుద్ధి చెప్పిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో వెలుగుచూసింది.కొందరు మహిళలు తమ గ్రామానికి వెళ్లేందుకు ధర్మపురి నుంచి తిరుపత్తూరుకు జాతీయ రహదారిపై గూడ్స్ వాహనం ఎక్కారు. మహిళలు ప్రయాణిస్తున్న గూడ్స్ వాహనం చూసిన ఏడుగురు యువకులు కారులో వెంబడించారు. ఆకతాయిలను చూసిన గూడ్స్ డ్రైవరు మణిగందన్ వేగంగా వాహనం నడుపుతుండగా కారును అడ్డం పెట్టి ఆపారు. అనంతరం ఈవ్ టీజర్లు మహిళలను లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు.

 ఈవ్ టీజర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో గొడవ విన్న సమీప గ్రామస్థులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురు ఈవ్ టీజర్లను పట్టుకున్నారు.గ్రామస్థులను చూసి ఏడుగురు ఆకతాయిల్లో నలుగురు పారిపోగా, ముగ్గురు దొరికారు. దీంతో గ్రామస్థులు ముగ్గురు ఈవ్ టీజర్లను చెట్టుకు కట్టేసి కొట్టారు.ఈవ్ టీజర్లు మద్యం తాగి ఉన్నారని గ్రామస్థులు చెప్పారు. ఈవ్ టీజర్లకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...