16ఎస్బీవీఎం2: గెడ్డ వాగు విషయమై తగాదా పడుతున్న గ్రామస్థులు గెడ్డవాగు కోసం ఇరువర్గాల ఘర్షణ సమన్వయంతో సమస్య పరిష్కరించుకోవాలన్న అధికారులు లేకుంటే స్థలం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక సబ్బవరం, మే 16: మండలంలోని నారపాడు శివారు బలిజపాలెం గ్రామంలో గెడ్డవాగు కోసం సోమవారం ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ రమణ, ఇరిగేషన్ ఏఈ రామలక్ష్మణ్, సర్వేయర్ శ్రీనివాసరావు గ్రామంలోకి వెళ్లి ఆరా తీశారు. నారపాడు సర్వే నెంబరు 161 గెడ్డ వాగు స్థలం 1.37 ఎకరాల్లో తాసుబిల్లి వారి కల్లాలకు తోవ ఉండేదని, దాన్ని మామిడి నానాజీ తదితరులు ఆక్రమించి మూసేశారని గ్రామస్థులు తాసుబిల్లి అప్పారావు, స్వామినాయుడు, జనార్థన్ తెలిపారు. తమ కల్లాలోకి వెళ్లేందుకు కనీసం 15 అడుగులు తోవ ఇవ్వాలని అధికారులను కోరారు. మామిడి నానాజీ తదితరులు మాట్లాడుతూ.. గెడ్డవాగు నుంచి తోవ లేదనీ, రియల్ ఎస్టేట్ కోసమే రోడ్డు అడుగుతున్నారని, పంచాయతీ తీర్మానం లేనందున రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ మామిడి శంకరరావు మాట్లాడుతూ, రోడ్డు విషయమై తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. వివాదం సద్దుమణగకపోవడంతో సర్వేయర్ గెడ్డవాగు సరిహద్దులను నిర్ణయించారు. పంచాయతీ తీర్మానం, సమన్వయంతో సమస్య పరిష్కరించుకోవాలని, లేకుంటే గెడ్డ వాగు చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించి వెళ్లిపోయారు
గెడ్డవాగు కోసం ఇరువర్గాల ఘర్షణ
సమన్వయంతో సమస్య పరిష్కరించుకోవాలన్న అధికారులు
లేకుంటే స్థలం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
సబ్బవరం, మే 16: మండలంలోని నారపాడు శివారు బలిజపాలెం గ్రామంలో గెడ్డవాగు కోసం సోమవారం ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ రమణ, ఇరిగేషన్ ఏఈ రామలక్ష్మణ్, సర్వేయర్ శ్రీనివాసరావు గ్రామంలోకి వెళ్లి ఆరా తీశారు. నారపాడు సర్వే నెంబరు 161 గెడ్డ వాగు స్థలం 1.37 ఎకరాల్లో తాసుబిల్లి వారి కల్లాలకు తోవ ఉండేదని, దాన్ని మామిడి నానాజీ తదితరులు ఆక్రమించి మూసేశారని గ్రామస్థులు తాసుబిల్లి అప్పారావు, స్వామినాయుడు, జనార్థన్ తెలిపారు. తమ కల్లాలోకి వెళ్లేందుకు కనీసం 15 అడుగులు తోవ ఇవ్వాలని అధికారులను కోరారు. మామిడి నానాజీ తదితరులు మాట్లాడుతూ.. గెడ్డవాగు నుంచి తోవ లేదనీ, రియల్ ఎస్టేట్ కోసమే రోడ్డు అడుగుతున్నారని, పంచాయతీ తీర్మానం లేనందున రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ మామిడి శంకరరావు మాట్లాడుతూ, రోడ్డు విషయమై తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. వివాదం సద్దుమణగకపోవడంతో సర్వేయర్ గెడ్డవాగు సరిహద్దులను నిర్ణయించారు. పంచాయతీ తీర్మానం, సమన్వయంతో సమస్య పరిష్కరించుకోవాలని, లేకుంటే గెడ్డ వాగు చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించి వెళ్లిపోయారు